అధిక ర‌క్త‌పోటుకు చెక్ పెట్టే చేప‌నూనె..ఆ ప్ర‌యోజ‌నాలు కూడా!

చేప‌లు.రుచిగా ఉండ‌ట‌మే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచివ‌న్న సంగ‌తి తెలిసిందే.

 Fish Oil Helps To Control High Blood Pressure! Fish Oil, Control High Blood Pres-TeluguStop.com

అందుకే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది చేప‌ల‌ను ఇష్టంగా తింటుంటారు.అయితే చేప‌లే కాదు చేప నూనెతో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎక్కువ జిడ్డు కలిగిన చేపల కణజాలం నుంచి ఈ నూనెను తీస్తారు.విట‌మిన్ ఎ, విట‌మిన్ డి, ప్రోటీన్స్‌, మిన‌ర్స్‌, ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఇలా ఎన్నో పోష‌కాలు చేప నూనెలో ఉంటాయి.

అందుకే చేప నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతుంటారు.మ‌రి చేప నూనె తీసుకోవ‌డం వ‌ల్ల పొందో ప్ర‌యోజ‌నాలు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవ‌ల కాలంలో చాలా మంది అధిక ర‌క్త పోటుతో బాధ ప‌డుతున్నారు.ఈ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తే.ప్రాణాల‌కే ముప్పుగా మారుతుంది.అయితే ఇలాంటి వారు చేప నూనెను తీసుకుంటే.

అందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ర‌క్త పోటును అదుపులోకి తెస్తుంది.

అలాగే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి కూడా చేప నూనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

చేప నూనె తీసుకోవ‌డం వ‌ల్ల పొటు మ‌రియు ఇత‌ర శ‌రీర భాగాల్లో పేరుకుపోయి ఉన్న కొవ్వు కరుగుతుంది.ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు.

ఈ మధ్య కాలంలో చిన్న వ‌య‌సులో చాలా మంది కంటి చూపు స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారు.అయితే చేప నూనె తీసుకోవ‌డం వ‌ల్ల.

అందులో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపు మెరుగు ప‌రుస్తుంది.మ‌రియు వృద్ధాప్యంలో వ‌చ్చే కంటి సంబంధిత‌ వ్యాధుల నుంచి కూడా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది.

Telugu Pressure, Fish Oil, Tips, Bp-Telugu Health - తెలుగు హెల

మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులకు చేప నూనె ఎంతో మేలు చేస్తుంది.చేప నూనెను ప్ర‌తి రోజు తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.ఇక చేప నూనెను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా బ‌ల‌ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube