క్రికెట్ లవర్స్(Cricket Lovers) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ (India-Pak)మ్యాచ్ కు వేదిక ఖరారైంది.భద్రతా కారణాల వల్ల టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లను యూఏఈలో ఆడనుంది.
గ్రూప్ Aలో మన భారత్ తో పాటు దాయాది పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ (Pakistan, New Zealand, Bangladesh)లు ఉన్నాయి.ఈ నేపథ్యంలో అందరి దృష్టి 2025, ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ పైనే ఉంది.
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
దుబాయ్ స్టేడియం (Dubai Stadium)25,000 మంది ప్రేక్షకులతో కిక్కిరిసిపోనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
టికెట్ల కోసం ఇప్పటికే విపరీతమైన డిమాండ్ నెలకొంది.విషయం ఏమిటంటే, ఐసీసీ ఇంకా అధికారికంగా టికెట్ల అమ్మకాలు ప్రారంభించకముందే, ఎక్స్‌ఛేంజ్‌టికెట్స్.
కామ్ అనే వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.డిమాండ్‌ను బట్టి ధరలు మారుతుండటం గమనార్హం.2025, జనవరి 16 నాటికి ఉన్న సమాచారం ప్రకారం టికెట్ ధరలు అక్షరాలా రూ.56,000 నుంచి రూ.2,24,000 వరకు ఉన్నాయి.
టికెట్ల ధరల వివరాలు చూస్తే జనరల్ స్టాండ్ 2,386 అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్‌లు (సుమారు రూ.56,170), ప్రీమియం టికెట్ 5,032 దిర్హామ్‌లు (సుమారు రూ.1,18,498).వీటితోపాటు బుకింగ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు 1,332 దిర్హామ్‌లు (సుమారు రూ.31,357) ఉంటాయి.గ్రాండ్ లాంజ్ (ఇద్దరికి): 12,240 దిర్హామ్‌లు (సుమారు రూ.2,88,150) ప్లాటినం టికెట్లు (ఇద్దరికి) 17,680 దిర్హామ్‌లు (సుమారు రూ.4,16,219).దీనికి అదనంగా బుకింగ్ ఛార్జీలు 2,340 దిర్హామ్‌లు (సుమారు రూ.55,087) చెల్లించాలి.
ఒక సింగిల్ ప్లాటినం ఎన్‌క్లోజర్ టికెట్ ధర దాదాపు రూ.2,24,117 గా ఉంది.ఇలా టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
అయితే, ఐసీసీ ఇంకా అధికారికంగా టికెట్ల అమ్మకాలు ప్రారంభించలేదు.కేవలం టికెట్ల కోసం రిజిస్ట్రేషన్లు మాత్రమే మొదలుపెట్టింది.
ఐసీసీ ద్వారా టికెట్లు కొనుగోలు చేస్తే ధరలు తక్కువగా ఉండే అవకాశం ఉంది.దుబాయ్ వెళ్లే అభిమానులు ప్రయాణ, వసతి ఖర్చులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
ప్రస్తుతానికి, ఎక్స్‌ఛేంజ్‌టికెట్స్.కామ్ తాము స్పాన్సర్లు, రీసెల్లర్ల నుంచి టిక్కెట్లను సేకరిస్తున్నామని, 100% మనీ-బ్యాక్ గ్యారెంటీని ఇస్తున్నామని చెబుతోంది.అయితే, ఇది ఐసీసీ అధికారిక భాగస్వామి అవునా, కాదా అనేది తెలియాల్సి ఉంది.అందుకే అభిమానులు తొందరపడి ఎక్కువ డబ్బులు చెల్లించకుండా ఉండాలంటే ఐసీసీ అధికారికంగా టికెట్లు విడుదల చేసే వరకు వేచి చూడటం మంచిది.