తమిళనాడులోని కోయంబత్తూరులో( Coimbatore ) ఆదివారం జరిగిన ఓ షాకింగ్ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.నల్లంపాలయం-సంగనూర్ రోడ్డుపై జరిగిన ఈ ఘటనలో మోహన్‌రాజ్( Mohanraj ) అనే వ్యక్తి ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటుతుండగా, ఎదురుగా హెల్మెట్ లేకుండా బైక్‌పై వస్తున్న హెడ్ కానిస్టేబుల్ జయప్రకాష్( Head Constable Jayaprakash ) ఒక్కసారిగా అతడి చెంపపై కొట్టాడు.
అంటే సదరు హెడ్ కానిస్టేబుల్ ట్రాఫిక్ రూల్స్( Traffic Rules ) పాటించడు కానీ ప్రజలపై మాత్రం దౌర్జన్యానికి దిగేస్తాడు.ఇది ఎంతవరకు న్యాయం అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు.
చిన్నవేదాంపట్టికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి మోహన్‌రాజ్ రోడ్డు దాటుతుండగా,( Crossing Road ) కవుండంపాలయం పోలీస్ స్టేషన్‌లో పనిచేసే జయప్రకాష్ బైక్ వేగం తగ్గించాడు.పోలీస్‌ను చూసి మోహన్‌రాజ్ ఆగినా, ఊహించని విధంగా జయప్రకాష్ అతడిని కొట్టడం చూసి అందరూ షాకయ్యారు.
ఎందుకు కొట్టాడో కూడా చెప్పకుండా జయప్రకాష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పోలీస్ ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు.
ఉన్నతాధికారులు వెంటనే ఈ ఘటనపై దృష్టి సారించారు.హెడ్ కానిస్టేబుల్‌ను సోమవారం కోయంబత్తూరు సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు పిలిపించారు.
ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది.
ఇలాంటి ఘటనలు ప్రజల్లో పోలీసుల ప్రవర్తనపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.పోలీసులు విధి నిర్వహణలో మరింత బాధ్యతగా, గౌరవంగా ప్రవర్తించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రజాసేవలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం మరోసారి గుర్తు చేసింది.
తప్పు చేసిన వారిని కొట్టినా ఓకే కానీ అమాయకులను మరీ శారీరకంగా హింసించడం, అవమానించడం అంగీకరించదగిన విషయం కాదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.