నాటుకోడి పులుసు రాగి సంగటి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

నాటుకోడి పులుసు ( Natukodi Pulusu )రాగి సంగటి.ఈ రెండిటి కాంబినేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందో టేస్ట్ చేసిన వారికే తెలుస్తుంది.

 Wonderful Health Benefits Of Natukodi Pulusu Ragi Sangati! Natukodi Pulusu Ragi-TeluguStop.com

రాయలసీమ ప్రాంతంలో మోస్ట్ పాపులర్ డిష్ ఇది.ప్రస్తుతం అన్ని చోట్ల ఇది దొరుకుతుంది.పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా తమ మెనూలో ఈ డిష్ ను చేర్చారు.రుచి పరంగానే కాదు నాటుకోడి పులుసు రాగి సంగటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

రుచిలో, పోషకాల్లో నాటుకోడి మాంసానికి మ‌రొక‌టి సాటిలేదు.నాటుకోడిలో ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది.

అలాగే ఫైబర్, ప్రోటీన్ తో సహా అనేక పోషకాలు నాటుకోడి లో ఉంటాయి.చికెన్, మటన్, సీ ఫుడ్ కంటే నాటుకోడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ధ‌ర కూడా కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది.అయినా సరే నాటుకోడిని ఓ ప‌ట్టు ప‌ట్టాల్సిందే.

ఏ వ‌య‌సు వారైనా నాటుకోడిని నిశ్చింతగా తినవచ్చు.

Telugu Tips, Healthy, Natukodi Pulusu, Natukodipulusu, Ragi Sangati-Telugu Healt

ముఖ్యంగా రాగి సంగటితో నాటుకోడి పులుసు తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ( Immune system ) బలపడుతుంది.ఎముకలు, కండరాలు పుష్టిగా మారతాయి.కీళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే రాగి సంగటి తో నాటు కోడి పులుసును తింటే ఒత్తిడి దూరం అవుతుంది.మధుమేహం వ్యాధి గ్రస్తులకు కూడా రాగి సంగటి నాటుకోడి పులుసు ఎంతో మేలు చేస్తాయి.

Telugu Tips, Healthy, Natukodi Pulusu, Natukodipulusu, Ragi Sangati-Telugu Healt

వారానికి ఒక్కసారి అయినా మధుమేహం ఉన్న వారు ఈ రెండిటిని తీసుకుంటే రక్తంలో చక్కెత‌ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.అంతేకాదు నాటుకోడి పులుసు రాగి సంగటి తినడం వల్ల.వాటిలో ఉండే ఐర‌న్‌ రక్తహీనతను త‌రిమికొడుతుంది.ఫైబ‌ర్ జీర్ణ వ్యవస్థ ( Human digestive syste )పనితీరును మెరుగుప‌రుస్తుంది.ప్రోటీన్ కొరత తలెత్తకుండా సైతం ఉంటుంది.అయితే మంచిది కదా అని రోజు అదే పని మీద ఉండకండి.

అతిగా తీసుకుంటే అమృత‌మైనా విష‌మే అవుతుంది.కాబ‌ట్టి, వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్ర‌మే నాటుకోడి పులుసు రాగి సంగటి తీసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube