మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ లలో( Music Streaming Apps ) సరికొత్తగా పలు ఏఐ ఫీచర్లు( AI Features ) అందుబాటులోకి వచ్చాయి.ఆ ఫీచర్ల వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.
ఇప్పటికే స్పాటి ఫై ప్రీమియం యూజర్ల కోసం ఏఐ ఆధారిత ప్లే లిస్ట్ జనరేటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.తాజాగా amazon సైతం ఇలాంటి ఫీచర్ నే ప్రవేశపెట్టింది.
ఈ ఫీచర్ కు మ్యాస్ట్రో( Maestro ) అనే పేరు పెట్టారు.ఇక ఈ ఫీచర్ తో ఇంటర్నెట్ ఉంటే చాలు ఎంత ఆన్లైన్ లో ఇష్టం వచ్చిన పాటలు వినొచ్చు.
ఈ మ్యాస్ట్రో ఫీచర్ సహాయంతో ప్రాంప్ట్స్ ఆధారంగా ప్లే లిస్ట్ ను క్రియేట్ చేయడంతో పాటు ఏమోజీలతోనూ ఈ ఫీచర్ పనిచేస్తుంది.మ్యాస్ట్రో ఫీచర్ సృష్టించిన ప్లే లిస్ట్ ను( Play List ) తరువాత ఎప్పుడైనా వినాలనుకుంటే సేవ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.
అంతేకాదు కావాలనుకుంటే ఇతరులతోనూ షేర్ చేసుకోవచ్చు.
ఇక అభ్యంతరకర కంటెంట్లను అడ్డుకోవడం కోసం ఇందులో ఓ ప్రత్యేక ఫీచర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే అభ్యంతరకర కంటెంట్లకు చెక్ పెట్టినట్టే.ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ లో అందుబాటులో ఉంది.
టెస్టింగ్ దశ పూర్తయిన తర్వాత త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.
మ్యూజిక్ విషయానికి వస్తే.గతంలో పాటలు వినాలంటే మెమొరీ కార్డ్ లలో పాటలను లోడ్ చేసుకుని వినేవారు.ప్రస్తుతం ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ లో ఎవరికి వాళ్లే డౌన్లోడ్ చేసుకుని రోజులు వచ్చేసాయి.
ఇక స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత స్ట్రీమింగ్ తీరే మారిపోయింది.మొత్తానికి ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తే మ్యూజిక్ ప్రియులకు పండుగే పండగ.