నిరాడంబరంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం..జెండా ఆవిష్కరించిన కేటీఆర్

హైదరాబాద్ లోని తెలంగాణభవన్ లో భారత్ రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ ) పార్టీ( BRS Party ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) పూలమాల వేశారు.

 Brs Foundation Day Modestly Ktr Unveiled The Flag Details, Kcr, Brs Foundation D-TeluguStop.com

తరువాత బీఆర్ఎస్ పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు.ఈ వేడుకల్లో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్( Election Code ) అమలులో ఉన్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా జరుపుతున్నారు.కాగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ్టితో 23 ఏళ్లు పూర్తి చేసుకుంది.

Telugu Brs Day, Brs, Brs Ktr, Hyderabad, Ktr, Ktr Flag, Telangana-Latest News -

జలదృశ్యం వేదికగా ఏప్రిల్ 27, 2001 న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ ) ఆవిర్భవించింది.12 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్… ( KCR ) పార్టీలన్నీ తెలంగాణ నినాదాన్ని ఎత్తుకునేలా చేశారు.జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించారు.ఈ క్రమంలోనే పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు.పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ( Telangana ) మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు.

పర పీడన చెర విడిపించిన ఉద్యమ జెండా గులాబీ అని పేర్కొన్నారు.

Telugu Brs Day, Brs, Brs Ktr, Hyderabad, Ktr, Ktr Flag, Telangana-Latest News -

జెండా మోసి, జంగ్ చేసిన లక్షలాది కార్యకర్తలే బలం.బలగమన్నారు.చావునోట్లో తల పెట్టి సాహసంగా పోరాడిన దళపతి కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు.

లాఠీలకు, జైళ్లకు వెరవక కొట్లాడిన పార్టీ సైనికుల త్యాగనిరతిని మరువలేమని పేర్కొన్నార.ఆటుపోట్లకు అదిరిపడలేదు.

ఎదురుదెబ్బలకు బెదిరిపోలేదని చెప్పారు.అదేవిధంగా గెలిస్తే పొంగిపోలేదు.

ఓటములకు కుంగిపోలేదన్నారు.వెయ్యి దాడులు.

లక్ష కుట్రలను ఎదిరించి నిలిచిన జెండా గులాబీ అని తెలిపారు.తాము ఏ పాత్రలో ఉన్నా జనమే ఎజెండా అని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube