కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి( Kadiyam Srihari ) కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao) రాజీనామా డ్రామాకు తెరతీశారని విమర్శించారు.
హరీశ్ రావు పక్కా డ్రామా మాస్టర్ అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.హరీశ్ రావు చేసిన సవాల్ కు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కట్టుబడి ఉన్నారని తెలిపారు.
తన బిడ్డ కడియం కావ్య( Kadiyam Kavya ) గెలిచాక మందకృష్ణ మాదిగ( Manda Krishna Madiga ) తన ఇంటికొచ్చి దండం పెడతాడని చెప్పారు.ఫోన్ ట్యాపింగ్ కామన్న అన్న కేసీఆర్ అధికారులను బలిచేశారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రమేయం లేకుండానే వాళ్లు ఫోన్ ట్యాపింగ్ చేశారా అని ప్రశ్నించారు.గత ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు కేసీఆరే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.







