తండ్రి కూరగాయల వ్యాపారి.. కూతురు యూపీఎస్సీ ర్యాంకర్.. స్వాతి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ప్రస్తుత కాలంలో నర్సరీ చదివించాలంటే కూడా లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది.

అయితే కెరీర్ పరంగా లక్ష్యాలను సాధించాలంటే కృషి, పట్టుదల ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే.

సాధించాలనే తపన ఉంటే కష్టపడితే ఏదో ఒకరోజు ఆశించిన ఫలితాలు దక్కుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.యూపీఎస్సీ పరీక్ష( UPSC Exam )లో ఐదుసార్లు ఫెయిల్యూర్ ఎదురైనా ఆరో ప్రయత్నంలో సక్సెస్ సాధించి స్వాతి మోహన్ రాథోడ్ వార్తల్లో నిలిచారు.

మహారాష్ట్ర రాష్ట్రంలో సోలాపూర్( Solapur ) కు చెందిన కూరగాయల వ్యాపారి కూతురు అయిన స్వాతి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్య సాధన విషయంలో మాత్రం వెనుకడుగు వేయలేదు.నలుగురు అక్కాచెల్లెళ్లలో స్వాతి( Swathi mohan rathod ) ఒకరు కాగా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన స్వాతి కోలాపూర్ లోని వాల్బంద్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశారు.ఎన్ని కష్టాలు ఎదురైనా సాధించాలనే తపనతో ముందుకెళ్తున్నానని స్వాతి చెబుతున్నారు.

ఐదు ప్రయత్నాల్లో ఫెయిల్యూర్ ఎదురైతే చాలామంది యూపీఎస్సీ పరీక్షలపైనే నెగిటివ్ అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు.అయితే స్వాతి మాత్రం వెనుకడుగు వేయకుండా మరోసారి ప్రయత్నించి లక్ష్యాన్ని సాధించారు.

Advertisement

ఆరో ప్రయత్నంలో స్వాతి 492వ ర్యాంక్ సాధించడం గమనార్హం.తల్లి బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ చదువుకున్న స్వాతి తన సక్సెస్ తో ప్రశంసలు అందుకున్నారు.

స్వాతి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు.ఒక్కో మెట్టు పైకి ఎదిగి స్వాతి ప్రశంసలు అందుకుంటున్నారు.పట్టుదలతో లక్ష్యాన్ని సాధించిన స్వాతి ప్రతిభను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

స్వాతి మోహన్ రాథోడ్ తన సక్సెస్ తో కుటుంబానికి సైతం అండగా నిలవడం గమనార్హం.స్వాతి మోహన్ రాథోడ్ మంచి ఉద్యోగం సాధించడం వల్ల ఆమె కుటుంబ కష్టాలు తీరినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చేపల వర్షం ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు