ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…రవితేజ ( Ravi Teja )ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( Indian film industry ) మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న రవితేజ ఇండస్ట్రీకి ఎవ్వరి సపోర్ట్ లేకుండా వచ్చి ఎదగడమే కాకుండా ప్రస్తుతం కమర్షియల్ సినిమాలను నమ్ముకుని ముందుకు సాగుతున్నాడు.

నిజానికి ఆయన జానర్ మార్చి డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగితే ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుంది.తద్వారా ఆయన భారీ విజయాలను సాధించుకునే అవకాశాలు కూడా ఉంటాయి.మరి ఇవన్నీ కాకుండా ఆయన రొటీన్ సినిమాలు చేయడం వల్ల ఆయనకు వచ్చే లాభమైతే ఏదీ లేదు.ఇక దానికి మించి ఆయన చేస్తున్న సినిమాల ద్వారా ఆయనకంటు ఒక ఐడెంటిటిని కూడా మూట గట్టుకుంటున్నాడు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా కమర్షియల్ సినిమాలే కావడం విశేషం.

ఇక ఇదిలా ఉంటే తన తర్వాత సినిమాని బాబీ డైరెక్షన్ లో చేయబోతున్నడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయాలైతే క్లారిటీగా తెలియవు.కానీ ప్రస్తుతం బాబీకి డేట్స్ ఇచ్చే హీరోలు ఎవరు ఖాళీగా లేరు.
కాబట్టి రవితేజతో సినిమాలు చేసి ఆ తర్వాత మరొక స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో బాబీ ఉన్నట్టుగా తెలుస్తోంది…వీళ్ళ కాంబోలో పవర్ అనే సినిమా వచ్చింది.ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా ఇద్దరికి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది…ఇక చిరంజీవితో చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కూడా రవితేజకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించడం సూపర్ సక్సెస్ అవ్వడంతో వీళ్ళ కాంబినేషన్ కి మరింత బలం చేకూరింది…
.







