తిండి, బట్ట, ఇల్లుతో పాటు నిద్ర కూడా మనిషికి చాలా అవసరం.సుఖమైన నిద్ర లేకపోతే పై మూడు ఉన్నా దండగే.
ఎందుకంటే నిద్రలేమితో బాధపడేవారు సంపాదించినదంతా పూర్తిగా అనుభవించక ముందే పోతారు.అవును, నిద్రలేమి సమస్య ప్రాణాంతక వ్యాధులకి దారి తీస్తుంది.
మంచి నిద్ర రావాలంటే కొన్ని అలవాట్లు మానేయ్యాలి, మరికొన్ని అలవాటు చేసుకోవాలి.
* వ్యాయామం రోజూ చేయడమే కాదు, సరైన సమయంలో చేయాలి.
వ్యాయామం వలన కార్టిసల్ అనే హార్మోను విడుదల అవుతుంది.మంచి నిద్ర పడుతుంది.
అయితే, పడుకోవడానికి కొద్ది సమయం ముందు మాత్రం ఎలాంటి వ్యాయామం చేయకపోతేనే మంచిది.అందుకే ఉదయంపూట వ్యాయామం చేయాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు.
* మనం ఎలా అలవాటు చేస్తామో, మనం శరీరం అలాగే పనిచేస్తుంది.కాబట్టి రోజూ ఒకే సమయంలో పడుకోవడం, ఒకే సమయంలో నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.
* కొందరు మధ్యాహ్నం అతిగా నిద్రపోతారు.మధ్యాహ్నం గంట నుంచి గంటన్నర నిద్ర సరిపోతుంది.
అలా కాకుండా అతిగా నిద్రపోతే రాత్రిపూట నిద్రలోకి జారుకోవడం కష్టమైపోతుంది.
* పొద్దున్నే కాఫీ ఎందుకు తాగుతారు? అందులో లభించే కెఫైన్ శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది అనే కదా.మరి అలాంటి పదార్థం రాత్రిపూట తాగడం ఏరకంగా మంచిది? కాఫీ నిద్రకు అడ్డుగా మారుతుంది.కాబట్టి పడుకునే ముంది కాఫీ తాగొద్దు.
* డిన్నర్ లైట్ గా తినండి.లైట్ ఫుడ్స్ వలన కడుపులో ఎలాంటి అలజడులు సంభవించవు.
శరీరం సుఖంగా నిద్రపోతుంది.అలాగే మద్యపానం, ధూమపానం లాంటివి పక్కనపెట్టండి.
* డిహైడ్రేటెడ్ బాడితో ఎప్పుడూ పడుకోకండి.అలాగని పడుకోవడానికి కొద్ది ముందు కూడా నీళ్ళు తాగకండి.
పడుకోవటానికి ఓ గంటన్నర, రెండు గంటల ముందు సరిపడ నీళ్ళు తాగండి.ఇలా చేస్తే రాత్రిపూట నిద్రలేచి మూత్ర విసర్జన చేసే సమస్య నుంచి తప్పించుకుంటారు.
* ప్రస్తుత జీవనశైలి ప్రకారం, అతిముఖ్యమైన సూచన … బెడ్ రూమ్ లో కంప్యూటర్, టీవి, మొబైల్ ని ఉంచకండి.ఇవి మీ నిద్రకు సునాయాసంగా భంగం కలిగిస్తాయి.