స్టార్ హీరో బాలకృష్ణ ఆహా ఓటీటీలో టాక్ షోకు హోస్ట్ గా చేస్తూ వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే.టాక్ షోకు బాలయ్య హోస్ట్ గా వ్యవహరించడంలో వింతేం లేకపోయినా మెగా ఫ్యామిలీకి చెందిన ఆహా ఓటీటీ టాక్ షో కోసం బాలయ్య హోస్ట్ గా చేస్తుండటం గమనార్హం.ఈ షో కోసం బాలకృష్ణ ఏకంగా 4.8 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారు.ఒక్కో ఎపిసోడ్ కు 40 లక్షల రూపాయల చొప్పున 12 ఎపిసోడ్లకు బాలకృష్ణ పారితోషికం తీసుకుంటున్నారు.
దీపావళి నుంచి ఈ టాక్ షో ప్రసారం కానుందని తెలుస్తోంది.
ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేశారని తెలుస్తోంది.ఆహా నిర్వాహకులు ఈ షో కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.
అయితే మానవత్వం ఉన్న మనిషిగా, మంచి మనిషిగా బాలకృష్ణకు మంచి పేరు ఉండటంతో పాటు కష్టాల్లో ఉన్న ఎంతోమందికి బాలకృష్ణ సహాయం చేసి వార్తల్లో నిలిచారు.
షో ఫస్ట్ ఎపిసోడ్ సమయంలోనే బాలకృష్ణ తన రెమ్యునరేషన్ ను ఛారిటీకి ఇవ్వబోతున్నానని ప్రకటన చేయనున్నాడని తెలుస్తోంది.
ఇదే నిజమైతే బాలయ్య గొప్ప మనస్సును అందరూ మెచ్చుకోక తప్పదు.బాలకృష్ణ నటిస్తున్న అఖండ రిలీజ్ డేట్ కు సంబంధించి అతి త్వరలో క్లారిటీ రానుంది.భారీ బడ్జెట్ మూవీ కావడంతో రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

బాలయ్య గోపీచంద్ మలినేని మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలు కానుంది.కరోనా సమయంలో బాలకృష్ణ చేసిన సేవలు ప్రశంసలు అందుకున్నాయి.బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా బాలయ్య ఎంతోమంది అభాగ్యుల జీవితాలలో వెలుగును నింపడం గమనార్హం.
గోపీచంద్ మలినేని మూవీతో పాటు బాలయ్య అనిల్ రావిపూడి సినిమాలో కూడా నటించనున్నారు.బాలయ్య కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.