మన దేశంలో ఉన్న చాలా మంది ప్రజలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆహారాన్ని తినే అలవాటు ఉంటుంది.కొందరు కారంగా ఉండే ఆహారాన్ని తింటే మరికొందరు తక్కువ కారంగా ఉండే వాటిని తినడానికి ఇష్టపడతారు.
అయితే వారానికి మూడు రోజుల కంటే ఎక్కువ గా మాంసాహారాన్ని( Meat ) తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే రెడ్ మీట్( Red Meat ), ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తీసుకునేవారు పెద్ద ప్రేగు క్యాన్సర్ ను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
వారానికి కనీసం మూడుసార్లు రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం తినే వ్యక్తులకు ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలలో తెలిసింది.

ఆ వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే వారానికి మూడుసార్లు కంటే ఎక్కువసార్లు మాంసాహారం తీసుకోవడం వల్ల అనేక జీర్ణ సమస్యలు( Digestion Problems ) వస్తాయి.ఇందులోని ప్రోటీన్ కంటెంట్ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంటుంది.ఇది జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది.ఇది ఎసిడిటీ, మలబద్ధకానికి కూడా దారితీస్తుంది.జీర్ణ క్రియ కు సంబంధించిన ఇతర సమస్యలను కూడా ఇది కలిగిస్తుంది.ఇంకా చెప్పాలంటే మాంసాహారాన్ని రోజు తీసుకుంటే అది వారి జీవితకాలం పై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది.
మాంసాహార ప్రియుల కంటే శాఖాహారులు( Vegetarians ) ఎక్కువ కాలం జీవిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

అంతేకాకుండా ప్రస్తుత సమాజంలో రైతులు పంటలకు ఎక్కువగా యాంటీబయోటిక్స్ ఉపయోగిస్తున్నారు.దీన్ని తినేవారి శరీరంలోకి ఇది నేరుగా ప్రవేశించవచ్చు.ఇది రోగనిరొదక శక్తికి సంబంధించిన తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది.
అలాగే ఎక్కువ మొత్తంలో మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్( Cholestrol ) పెరిగిపోతుంది.దీని ఫలితంగా స్టెరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రాసెస్( Processed Meat ) చేసిన మాంసం ఉత్పత్తులను తీసుకోవడం వల్ల గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.మాంసారాన్ని తరచుగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
అలాగే ప్రతిరోజు రెడ్ మీట్ ను ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.అలాగే ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని ఎక్కువగా తింటే ఊబకాయం మారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
