పార్టీ పెట్టి అతి కొద్ది కాలంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెల్చుకుని.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు ఎన్టీఆర్.
కొంతకాలం పాటు రాజకీయాల్లో చాలా బిజీ అయ్యాడు.ముఖ్యమంత్రిగా ఎన్నో కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుట్టాడు ఎన్టీఆర్.
అదే సమయంలో తన కొడుకు బాలకృష్ణ హీరోగా కొనసాగుతున్నాడు.ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కానన్ని రోజులు తన సూచనల ప్రకారం సినిమాలు చేసేవాడు.
ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీ కావడం మూలంగా వరుసగా పలు సినిమాల్లో అపజయాలు మూటగట్టుకున్నాడు.ఇలాగే పరిస్థితి కొనసాగితే బాలయ్య కెరీర్ కు కష్టం అని భావించాడు.
అందుకే తానే స్వయంగా ఓ సినిమాను నిర్మించాలని భావించాడు.
అదే సమయంలో వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న దర్శకుడు కోదండరామిరెడ్డిని తను నిర్మించబోయే సినిమాకు దర్శకత్వం వహించాలని కోరాడు.
ఈ విషయాన్ని బాలయ్య మేనేజర్.కోదండరామిరెడ్డికి చెప్పాడు.
మీకు ఓకే అయితే ఎన్టీఆర్ ను కలవండి అని చెప్పాడు.సరే అన్న ఆయన.మద్రాసు నుంచి హైదరాబాద్ కు వచ్చి.ఎన్టీఆర్ ను కలిశాడు.
తెల్లవారు జామున నాలుగున్నరకు అబిడ్స్ లోని ఎన్టీఆర్ ఇంటి వరండాలో నిలబడ్డాడు.విషయం తెలుసుకుని బయటకు వచ్చిన ఎన్టీఆర్.
ఆప్యాయంగా పలకరించాడు.
లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు.
ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు.బాలయ్య కోసం మంచి సినిమా కథను ఎంపిక చేయాలని కోరాడు.
సినిమా పూర్తి బాధ్యత తన మీదే పెట్టాడు.
అందుకే పలుమార్లు.ఆయనతో కథ విషయంలో చర్చలు జరిపాడు.ఎన్నోమార్లు అబిడ్స్ లోని ఎన్టీఆర్ ఇంట్లో మీటయ్యాడు.
అధికారులతో బిజీగా ఉన్నా.కోదండరామిరెడ్డిని ఆప్యాయంగా పిలిచి పలకరించేవాడు.
దర్శకుడిగా ఎంతో గౌరవం ఇచ్చేవాడు.తన కుమారుడి సినిమా కెరీర్ ను మలుపు తిప్పబోతున్న వ్యక్తికి ఎంతో గౌరవం ఇచ్చేవాడు.
మొత్తంగా బాలయ్య కోసం ఓ చక్కటి కథ రెడీ చేశాడు.ఓ రోజు ఫైనల్ డిస్కర్షన్ జరిగింది.
ఎన్టీఆర్ కు కూడా ఈ సినిమా కథ నచ్చడంతో ఓకే చెప్పాడు.ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎలా తీశారు? అనేది వేరే విషయం.