ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 6.46
సూర్యాస్తమయం:సాయంత్రం 05.43
రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు: మ.2.00 సా4.00 వరకు
దుర్ముహూర్తం:సా.5.02 ల5.53వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు రాకుండా చూసుకోండి.ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడమే మంచిది.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
మిథునం:

ఈరోజు మీ బంధువులతో మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.ఉద్యోగంలో సభ్యులతో కొన్ని చికాకులు తప్పవు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.
కర్కాటకం:

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహం:

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
కన్య:

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.
స్నేహితులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
తులా:

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి.
వృశ్చికం:

ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాలను పాల్గొంటారు.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
ధనస్సు:

ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.
మకరం:

ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.వ్యాపారానికి సంబంధించిన పెట్టబడి విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.
కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వారితో కలిసి బయట సమయాన్ని కూడా కాలక్షేపం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
మీనం:

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.