బాలీవుడ్ నటి అలియాభట్ ఈ ఏడాది నటుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకొని జీవితంలోకి అడుగుపెట్టడమే కాకుండా పెళ్లయిన కొన్ని నెలలకే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు.ఇలా పెళ్లయినా కొన్ని నెలలకి ఈమె అమ్మ కావడంతో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ అర్థమైంది.
ఇక కూతురికి జన్మనిచ్చిన తర్వాత అలియా భట్ పూర్తిగా తన సమయాన్ని తన కూతురికే అంకితం చేసి తల్లిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఇలా కూతురికి జన్మనిచ్చి దాదాపు రెండు నెలలవుతున్న సమయంలోనే ఈమెకి తన సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
సాధారణంగా డెలివరీ తర్వాత శరీరంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తాయి.అయితే అలియా భట్ సైతం తన శరీర ఫిట్నెస్ కోసం ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా తలక్రిందులుగా వేలాడుతూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటో కనుక చూస్తే ఈమె తిరిగి సినిమాల్లోకి రావడానికి సిద్ధమవుతుందా అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది.
అలియా భట్ ఇలాంటి ఫోటోని షేర్ చేస్తూ మెల్లిమెల్లిగా మళ్లీ నాలో నన్ను చూసుకోవడానికి సిద్ధమవుతున్నాను.ఇలా నా గురువు అన్షుక యోగాతో కలిసి వర్కౌట్లు మొదలుపెట్టేశాను.డెలివరీ తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారి శరీరాల గురించి ఆలోచించుకోమని నాతోటి అమ్మలకు చెబుతున్నాను.అయితే మొదట్లోనే పెద్ద పెద్దవి కష్టతరమైనటువంటి కాకుండా మీకు వీలయ్యే యోగ చేయమని ఈమె సలహా ఇచ్చారు.
ప్రస్తుతం నన్ను నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను ఇంకా చేసుకోవాల్సింది చాలా ఉంది.ఈ ఏడాది నా శరీరం ఎప్పుడు పడనంత కష్టపడింది.అయితే బిడ్డకు జన్మనివ్వడం ఒక అద్భుతమైన ఫీలింగ్, మన శరీరాన్ని మనం ప్రేమించడమే దానికి మనం చేయగలిగింది అంటూ ఈ సందర్భంగా ఈమె సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.