తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి నవరస నటసార్వభౌముడు అనే బిరుదు సంపాదించుకున్న నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈయన అంత్యక్రియలు కూడా శనివారం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంచనాలతో, హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగాయి.
ఇలా కైకాల మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని ఎంతోమంది సెలబ్రిటీలు ఆయన గురించి మాట్లాడడమే కాకుండా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఇలా కైకాల మరణించిన తర్వాత ఆయన గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇకపోతే ఆఖరి కోరిక ఒకటి అలాగే మిగిలిపోయిందని తన చివరి కోరిక నెరవేరుకుండానే కైకాల చనిపోయారని తెలుస్తుంది.ఇంతకీ కైకాల ఆఖరి కోరిక ఏంటి అనే విషయానికి వస్తే… కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి స్టార్ హీరోలు నటించిన మల్టీ స్టార్ సినిమాలలో నటించారు.
అయితే ఇలా మల్టీస్టారర్ సినిమాలలో నటించాలని తనకు ఎంతో ఇష్టంగా ఉండేదట.

ముఖ్యంగా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి చిరంజీవి,బాలకృష్ణ ఇద్దరు కలిసి మల్టీ స్టార్ సినిమా చేస్తే కనుక వారి సినిమాలో నటించాలని కోరిక ఈయనకు బలంగా ఉండేదట, ఇదే విషయాన్ని పలుమార్లు చిరంజీవి దగ్గర కూడా ప్రస్తావించారని తెలుస్తోంది.అయితే ఆ కోరిక తీరుకుండానే చనిపోయారని తెలుస్తుంది.మరి కైకాల గారి చివరి కోరికను చిరంజీవి బాలకృష్ణ నెరవేరుస్తారా? వీరిద్దరూ కలిసే మల్టీ స్టార్స్ సినిమాలో నటిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇక గత కొద్దిరోజుల క్రితం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రాంచరణ్ మల్టీస్టారర్ చిత్రంగా నటించిన RRR సినిమా చూసిన కైకాల ఎంతో సంతోషం వ్యక్తం చేశారని తెలుస్తోంది.







