సాధారణంగా చాలా మంది ముఖంపై పెట్టే శ్రద్ధ బాడీపై పెట్టరు.కానీ శరీరం మృదువుగా ప్రకాశవంతంగా మెరిసిపోతూ కనిపించాలని మాత్రం కోరుకుంటారు.
నిజానికి అటువంటి చర్మాన్ని పొందాలంటే కచ్చితంగా బాడీ కేర్( Body Care ) అనేది అవసరం.అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీ బాడీని సూపర్ బ్రైట్ గా మెరిపించడంలో అద్భుతంగా తోడ్పడుతుంది.
ఈ రెమెడీ ముందు ఖరీదైన సోప్స్ కూడా దిగదుడుపే.మరి ఇంకెందుకు ఆలస్యం రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్,( Oats ) మూడు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice ) మరియు పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Turmeric ) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.బాడీ కేర్ లో ఈ పౌడర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ పౌడర్ ను ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం.మిక్సీ జార్ లో రెండు బంగాళదుంప స్లైసెస్, రెండు టమాటో సైసెస్, రెండు కీర దోసకాయ స్లైసెస్ మరియు రెండు లెమన్ స్లైసెస్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్, బియ్యం పౌడర్ ను వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు లేదా రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని బాడీ మొత్తానికి పట్టించి 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చేతులతో బాడీని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటించడం వల్ల బాడీ పై పేరుకుపోయిన మురికి, చనిపోయిన చర్మం కణాలు తొలగిపోతాయి.
టాన్ రిమూవ్ అవుతుంది.స్కిన్ లోతుగా శుభ్రం అవుతుంది.
చర్మం అందంగా ఆరోగ్యంగా మారుతుంది.సూపర్ బ్రైట్ గా మెరుస్తుంది.
అలాగే ఈ రెమెడీని పాటించడంతో పాటు రెగ్యులర్ గా బాత్ అనంతరం బాడీకి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.శరీరానికి సరిపడా నీటిని అందించాలి.
హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి.అప్పుడే స్కిన్ కూడా హెల్తీగా హైడ్రేట్ గా ఉంటుంది.







