ఈశాన్య రాష్ట్రం మణిపూర్( Manipur ) గత కొంతకాలంగా జాతి వైరాలతో అట్టుడికిన విషయం తెలిసిందే.తాజాగా, అక్కడ జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్( Football Match ) మరోసారి వార్తల్లో నిలిచింది.
ఏకే 47 రైఫిల్స్,( AK-47 Rifles ) అమెరికన్ ఎం సిరీస్ తుపాకులతో క్రీడాకారులు ఫుట్‌బాల్ ఆడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.ఈ వీడియోను మణిపుర్‌కు చెందిన ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై మైతేయి( Meitei ) వర్గానికి చెందిన పౌర సమాజ సంస్థ ‘‘హెరిటేజ్ సొసైటీ’’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఈ వీడియోను ఎక్స్ లో పోస్టు చేస్తూ, ‘‘మణిపూర్‌లో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ వైరల్ అవుతోంది.క్రీడాకారులు బహిరంగంగా అధునాతన ఆయుధాలు ప్రదర్శించడం ఆందోళన కలిగిస్తోంది.ఇది కుకీ మిలిటెంట్ల( Kuki Militants ) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌నా? దీనిపై అధికారులు వెంటనే విచారణ జరపాలి’’ అంటూ మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ట్యాగ్ చేశారు.

వైరల్ వీడియో ప్రకారం, ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ ఇంఫాల్‌కు 30 కి.మీ దూరంలో ఉన్న కాంగ్‌పోక్పీ జిల్లాలోని గామ్నోఫై స్టేడియంలో నిర్వహించబడింది.సమాచారం ప్రకారం, ఈ మ్యాచ్ గత నెల 20న జరిగినట్లు తెలుస్తోంది.వీడియోలో ముదురు ఆకుపచ్చ దుస్తులు ధరించిన పలువురు స్టేడియం వద్ద తుపాకులతో కనిపించారు.ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్దెత్తున రచ్చ జరుగుతుంది.క్రీడా పోటీలకు సంబంధించి బహిరంగంగా ఆయుధాలను ప్రదర్శించడం చాలా మంది నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
దీనిపై అధికారుల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.మణిపూర్‌లో కొనసాగుతున్న జాతి విభేదాల మధ్య ఇలాంటి సంఘటనలు ఆందోళనకు కారణమవుతున్నాయి.
ఈ వీడియోపై ప్రభుత్వం, భద్రతా అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.మణిపూర్ లో పరిస్థితులు మళ్లీ యథావిధిగా నిలవాలని అందరూ ఆశిస్తున్నారు.







