సాధారణంగా ఒక్కోసారి జుట్టు చాలా పొడిబారిపోతూ ఉంటుంది.అందులోనూ ప్రస్తుత చలికాలంలో( Winter ) ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు.
వాతావరణంలో వచ్చే మార్పులు ఇందుకు ప్రధాన కారణం.అలాగే రెగ్యులర్ గా తల స్నానం చేయడం, వేడివేడి నీటిని హెయిర్ వాష్ కు ఉపయోగించడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించడం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను వాడటం వల్ల కూడా జుట్టు పొడిబారిపోతుంటుంది.
అయితే డ్రై గా, నిర్జీవంగా ఉన్న జుట్టును( Dry Hair ) ఒక్క వాష్ లోనే సూపర్ స్మూత్ గా మార్చుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్ చాలా బాగా సహాయపడుతుంది.

హెయిర్ మాస్క్ తయారీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక అరటి పండును( Banana ) స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవాలి.అలాగే ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్( Aloevera Gel ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, వన్ టేబుల్ స్పూన్ హనీ, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ మరియు వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ రెమెడీని కనుక పాటించారంటే జుట్టుకు మంచి తేమ లభిస్తుంది.పొడిబారిన జుట్టు స్మూత్ గా షైనీగా మారుతుంది.ఈ హెయిర్ మాస్క్ ను వారానికి ఒకసారి ప్రయత్నించవచ్చు.తద్వారా జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ వంటి సమస్యలు దూరమవుతాయి.
జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.
మరియు సిల్కీ అండ్ షైనీ హెయిర్ మీ సొంతం అవుతుంది.







