Coconut : మధుమేహం ఉన్నవారు పచ్చి కొబ్బరి తింటే ప్రమాదమా..?

పచ్చి కొబ్బరి( Raw Coconut ) ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ పచ్చి కొబ్బరి ఎంతో ఇష్టంగా తింటుంటారు.

 Is It Dangerous For People With Diabetes To Eat Raw Coconut-TeluguStop.com

అలాగే చాలా మంది పచ్చి కొబ్బరితో చట్నీ తయారు చేస్తుంటారు.రుచి పరంగానే కాదు పచ్చి కొబ్బరిలో పోషకాలు కూడా మెండుగా నిండి ఉంటాయి.

అందువ‌ల్ల ఆరోగ్యంతో పాటు చర్మ, జుట్టు సంరక్షణకు సైతం పచ్చి కొబ్బరి అద్భుతంగా తోడ్పడుతుంది.అయితే పచ్చి కొబ్బరిని కొందరు దూరం పెడుతుంటారు.

అలా దూరం పెట్టే వారిలో మధుమేహులు ముందు వరుసలో ఉంటారు.పచ్చికొబ్బరి తియ్యగా ఉండడం వల్ల షుగర్ లెవెల్స్( Blood Sugar Levels ) పెరుగుతాయని.

మధుమేహం ఉన్నవారు పచ్చి కొబ్బరి తింటే ప్ర‌మాద‌మ‌ని నమ్ముతుంటారు.కానీ అది పూర్తిగా అవాస్త‌వం.

మధుమేహం ఉన్నవారు పచ్చి కొబ్బరిని ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు.మధుమేహులకు పచ్చి కొబ్బరి చాలా మేలు చేస్తుంది.

-Telugu Health

పచ్చి కొబ్బరిలో ఫైబర్( Fiber ) మెండుగా ఉంటుంది.అమైనో ఆమ్లాలు మరియు గుడ్ ఫ్యాట్స్ పచ్చి కొబ్బరి లో ఉంటాయి.అందువల్ల మధుమేహం ఉన్నవారు పచ్చికొబ్బరిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.మధుమేహాన్ని నియంత్రించే సామర్థ్యం పచ్చి కొబ్బరికి ఉంది.కాబట్టి మధుమేహం ఉన్నవారు పచ్చి కొబ్బరిని తీసుకోవడం అస్సలు స్కిప్ చేయకండి.

-Telugu Health

ఇక పచ్చి కొబ్బరితో మరెన్నో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి.ఉదయాన్నే కాళీ కడుపుతో పచ్చి కొబ్బరి తింటే రోగ నిరోధక శక్తి( Immunity Power ) పెరుగుతుంది.వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడే సామ‌ర్థ్యం ల‌భిస్తుంది.

ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడే ప్రమాదం త‌గ్గుతుంది.అదే స‌మ‌యంలో జీర్ణ వ్యవస్థ బలపడుతుంది.

మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.రక్తహీనత బాధితులు నిత్యం పచ్చి కొబ్బరి తింటే శరీరంలో ఐరన్( Iron ) కొరత పరారవుతుంది.

రక్తహీనత దగ్గు ముఖం పడుతుంది.అంతేకాదు పచ్చి కొబ్బరి జుట్టు రాలడాన్ని త‌గ్గించి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

మ‌రియు చ‌ర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube