గ్రీన్ యాపిల్‌ను ఈ విధంగా తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు!

ప్రస్తుత వర్షాకాలంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం అంత సులభమేమీ కాదు.ఈ సీజన్లో రోగ నిరోధక వ్యవస్థ సహజంగానే బలహీనపడుతుంది.

 Consuming Green Apple In This Way During The Rainy Season Is Very Good For Healt-TeluguStop.com

దాంతో దగ్గు, జలుబు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి రకరకాల వ్యాధులు చుట్టుముట్టి ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి.వాటికి దూరంగా ఉండాలంటే కచ్చితంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా గ్రీన్ ఆపిల్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ప్రస్తుత వర్షాకాలంలో మీ ఆరోగ్యానికి తిరుగుండదు.మ‌రి లేటెందుకు అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

ముందుగా ఒక గ్రీన్ యాపిల్‌ను తీసుకుని వాట‌ర్‌లో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.అలాగే అర క‌ప్పు పైనాపిల్ ముక్క‌ల‌ను త‌రిగి పెట్టుకోవాలి.

ఒక క‌ప్పు పాల‌కూర‌ను కూడా వాట‌ర్‌లో క‌డిగి పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో గ్రీన్ యాపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్క‌లు, పాల‌కూర‌, నాలుగు ఐస్ క్యూబ్స్‌, ఒక గ్లాస్ వాట‌ర్‌, చిటికెడు న‌ల్ల ఉప్పు, మూడు గింజ తొల‌గించి ఖ‌ర్జూరాలు వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే గ్రీన్ యాపిల్ పాల‌కూర స్మూతీ సిద్ధం అవుతుంది.

Telugu Green Apple, Greenapple, Tips, Latest, Pineapple, Rainy Season, Smoothie,

ఈ స్మూతీ టేస్టీగా ఉండ‌ట‌మే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ఈ స్మూతీని డైలీ డైట్‌లో చేర్చుకుంటే.ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బూస్ట్ అవుతుంది.సీజ‌న‌ల్ వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే ఈ స్మూతీని తీసుకోవ‌డం వ‌ల్ల మెదడు పనితీరు వేగవంతం అవుతుంది.అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి విముక్తి ల‌భిస్తుంది.

కండరాలకు తగిన శక్తి అందుతుంది.ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

మ‌ధుమేహం వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.ఒక‌వేళ మ‌ధుమేహం ఉన్నా.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.మ‌రియు చ‌ర్మం కూడా య‌వ్వ‌నంగా మెరుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube