సాధారణంగా పిల్లలు ఉదయం ఏడు, ఎనిమిది గంటలకు నిద్ర లేవడానికి కూడా తెగ మారం చేస్తుంటారు.అందులోనూ ప్రస్తుత చలి కాలంలో బెడ్‌పై నుంచి లేవడానికి పిల్లలు మరీ ఎక్కువ పేచీలు పెడుతుంటారు.
అయితే అసలు పిల్లలను ఉదయాన్నే ఏ టైమ్‌కి నిద్ర లేపాలో తెలుసా.? తెల్లవారు జామున 5 గంటలకు.అవును, మీరు విన్నది నిజమే.తల్లిదండ్రులు కాస్త ఓపిక చేసుకుని పిల్లలను ఐదు గంటలకు నిద్రలేపాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగించి.అప్పుడు వారి చేత చిన్న చిన్న వ్యాయామాలను చేయించాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే గనుక ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి.ముఖ్యంగా తెల్లవారు జామున పిల్లలు నిద్ర లేచి చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల శరీరం ఫీట్‌గా, హెల్తీగా మారుతుంది.
రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది.అలాగే వేకువ జామున నిద్ర లేవడం వల్ల పిల్లల బ్రెయిన్ మునుపటి కంటే షార్ప్‌గా పని చేస్తుంది.ఏకాగ్రత స్థాయిలు మెరుగు పడతాయి.
చాలా మంది పిల్లలు లేట్‌గా లేచి బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే స్కూల్‌కి వెళ్లిపోతుంటారు.
అదే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తే గనుక బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి చక్కగా సమయం దొరుకుతుంది.మరియు హడావిడిగా పరుగులు పెట్టే పని కూడా ఉండదు.
కొందరు పిల్లలు రాత్రి పూట పది, పదకొండైన పడుకోకుండా స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోతుంటారు.అయితే పిల్లలను తెల్లవారి జామునే నిద్ర లేపేస్తే.వారు నైట్ తొమ్మిది గంటలకే బెడ్ ఎక్కేస్తారు.దాంతో వారి స్క్రీన్ టైమ్ తగ్గి.కంటి ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది.
ఇక పిల్లలు వేకువ జామున నిద్ర లేస్తే.
రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.ఒత్తిడికి దూరంగా ఉంటారు.
మరియు అనేక అనారోగ్య సమస్యలు వారి దరి దాపుల్లోకి వెల్లకుండా ఉంటాయి.