ఉసిరికాయ విష్ణు స్వరూపం.ప్రతి ఇంటిలోనూ ఉసిరికాయ తప్పని సరిగా ఉండాలని అంటారు.
ఉసిరికాయలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.ఉసిరికాయ తినడం వల్ల జుట్టురాలడం తగ్గుట, అజీర్తి సమస్యలు, శరీరంలోని మలినాలు తొలగుతాయి.
అంతేకాక శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.సంతాన సమస్యలు తొలగుతాయి.
శరీరం లో ఏర్పడే త్రిదోషాలు (వాత, పిత్త, కఫ దోషాలు)తొలగిపోతాయి. ఉసిరి దీర్ఘాయువుని ఇస్తుంది.
మరి ఇన్ని సుగుణాలు ఉన్న ఉసిరికాయను రాత్రి పూట,ఆదివారం నాడు తినకూడదు అని ఎందుకు అంటారు.
ఉసిరికాయ లో ఉండే విటమిన్ సి పేగులలో ఆమ్లాన్ని పెంచుతుంది.
రాత్రి సమయంలో ఆమ్లాలు తినడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు.అజీర్తి కారణంగా గుండె మంట వంటివి కలుగవచ్చు.
అంతేకాక ఉసిరికాయ శక్తిని ప్రేరేపిస్తుంది.రాత్రిపూట ఉసిరికాయ తినడం వల్ల అందులోని శక్తి ప్రేరేపకం మనల్ని మంచి నిద్రకు దూరం చేస్తుంది.
రక్తప్రసరణ వేగవంతం కావడంవలన కొందరికి ఆందోళన కలిగే అవకాశం ఉంది.అందుకని రాత్రి సమయంలో ఉసిరికాయ తినకూడదు అని అంటారు.
ఉసిరి కాయలో సూర్య శక్తి దాగి ఉంటుంది.సూర్యునికి ప్రధానమైన ఆదివారం నాడు ఉసిరికాయకు మరింత బలం చేకూరుతుంది.అటువంటి ఉసిరికాయని ఆ రోజంతా కదిలించకుండా ఆ తరువాతి రోజు తినడం వల్ల అనేక మంచి ఫలితాలు ఉంటాయి.కొందరు శుక్రవారం పూట కూడా ఉసిరికాయని తినకూడదనే నియమాన్ని పాటిస్తారు.
శుక్ర ప్రభావం ఉండే శుక్రవారం నాడు వేడిని, ఉద్రేకాన్నిపెంచే ఉసిరి కాయను తినకూడదు అని అంటారు.
DEVOTIONAL