దాదాపు దేశం వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ చేసిన పాపాలను, పుణ్యాలను ఈ భూమి మీదే అనుభవిస్తారు అని నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే మానవత్వం ఉన్న ప్రజలందరూ మనం చేసే ప్రతి పనిని పాపం, పుణ్యం అనే కోణంలోనే ఎక్కువగా చూస్తూ ఉంటారు.
ఏ ఏ కర్మలకు ఏ పుణ్యం లభిస్తుందో మరికొన్ని పనులు చేస్తే పాపం వస్తుందో అనే విషయాన్ని శాస్త్రం వివరంగా చెబుతోంది.పాపాలు చేసిన వ్యక్తి నరకానికి కచ్చితంగా వెళ్తాడని చాలామంది ప్రజలు నమ్ముతారు.
చేసిన పాపాలను తగ్గించుకోవడానికి చాలా పరిహారాలు చేస్తూ ఉంటారు.మనం భూమి మీద జీవించి ఉన్నప్పుడే పుణ్యం సంపాదించినట్లయితే మరణించిన తర్వాత స్వర్గం లభిస్తుందని కూడా చాలామంది నమ్ముతారు.
తప్పులు చేయడం అంటే మనం తెలియకుండా చేసిన తప్పులకు కూడా శిక్షలు పడే అవకాశం ఉంది.తెలియకుండా చేసిన వాటిని కూడా పాపలు గానే గుర్తిస్తారు.ఒక మనిషి తెలియకుండా ప్రతిరోజు ఇలాంటి తప్పులను చేస్తూ ఉంటాడు.చాలామంది ఇంట్లో వంట వండేటప్పుడు వారికి తెలియకుండానే బియ్యంలోని పురుగులను చంపేస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే వంట వండేటప్పుడు ఏవైనా వచ్చి పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి.అవి వంటల్లో చనిపోతూ ఉంటాయి.
ఇది మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది.దీని వల్ల కూడా పాపం తగులుతుంది.

కాబట్టి మనుషులు ఇలాంటి సమయాలలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.ఇంకా చెప్పాలంటే పిండి రుబ్బేటప్పుడు మిల్లులో మనకు తెలియకుండానే కొన్ని రకాల పురుగులు చనిపోతూ ఉంటాయి.వాటికి కూడా పాపం అంటుకునే అవకాశం ఉంది.మనం నడిచేటప్పుడు మన కాళ్లు చిన్న కీటకాలను చూడకుండా కీటకాలను తొక్కేస్తూ ఉంటాం.మన పాదాల క్రింద చిక్కుకొని మరణించే కీటకాల పాపం కూడా మనకు తగిలే అవకాశం ఉంది.ఇది ఏంట్రా ఇంత చిన్నచిన్న పురుగులు చనిపోతే కూడా పాపాలు ఉంటాయా అనుకునే వారికి అవి కూడా ఒక జీవులే కదా అని కొంతమంది సమాధానం చెబుతున్నారు.