మన దేశంలో చాలా మంది ప్రజలు ఎన్నో రకాల ఆచారాలను సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు.అలాగే మరి కొంత మంది ప్రజలు ఎలాంటి ఆచారాలను సంప్రదాయాలను పాటించకుండా జీవిస్తూ ఉన్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే సమస్త విశ్వానికి గురువుగా దక్షిణామూర్తిగా భావిస్తారు.అలాగే మర్రిచెట్టు క్రింద కూర్చుని ఋషుల చుట్టూ ఉన్నట్లుగా దక్షిణామూర్తి చిత్రపటం ఉంటుంది.
త్రిలోకాలకు ఉపదేశకునిగా దక్షిణామూర్తి జనన, మరణ, దుఃఖాలను పోగొడతాడు.శ్రీ ఆదిశంకరాచార్యులు( Sri Adishankaracharyalu ) స్వరపరిచిన దక్షిణామూర్తి స్తోత్రం( Dakshinamurthy Stotra ) పాటించడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఈ శ్లోకం శివుడికి సంబంధించినది.

కాబట్టి క్రమం తప్పకుండా జపిస్తే జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రతి గురువారం దక్షిణామూర్తి శ్లోకాన్ని పట్టించడం వల్ల అదృష్టం, అనుకూలమైన పరిస్థితులు కలిసి వస్తాయి.అలాగే ఈ స్తోత్రం పాటించడం వల్ల అనేక కారణాల వల్ల వాయిదా పడుతున్న వివాహం కూడా జరుగుతుంది.
గురు గ్రహ శాంతి( Guru Graha Shanti ) కోసం దక్షిణామూర్తిని పూజిస్తారు.విద్యార్థులు ఈ శ్లోకం పాటించడం చదువులో ఉన్నతంగా రాణిస్తారు.అలాగే జ్ఞానాన్ని అందించే గురువుగా దక్షిణామూర్తిని పరిగణిస్తారు.

దక్షిణామూర్తి స్తోత్రం అనేది శివుని రూపాలలో ఒకరైన దక్షిణామూర్తికి అంకితం చేసిన ప్రార్థన అని పండితులు చెబుతున్నారు.జ్ఞానాన్ని కలిగిన వ్యక్తిగా దక్షిణమూర్తిని పరిగణిస్తారు.అందుకే ఆయన్ని అంతిమ గురువుగా చెబుతారు.
దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో దక్షిణమూర్తికి అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి.సర్వోన్నత గురువుగా ఆయనను పూజిస్తారు.
క్రీస్తు శకం 8వ శతాబ్దంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆదిశంకరాచార్యులు స్వరపరిచారు.పది శ్లోకాలతో కూడి ఉంటుంది.
ప్రతి ఒక్కటి దక్షిణామూర్తి విభిన్న కోణాలను వివరిస్తుందని పండితులు చెబుతున్నారు.జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రాముఖ్యతను ఈ సూత్రాలు వివరిస్తాయి.