మీ కోర్కెలు.. సీక్రెట్ గా చెవులో చెప్తే.. ఈ గణపయ్య తీర్చేస్తాడు..

నైవేద్యం పేరుతో భక్తులు పత్రం, ఫలం ఏది ఇచ్చినా ఒదిగిపోయి భక్తుల కోర్కెలు తీరుస్తాడు బొజ్జ గణపయ్య. కానీ తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలోని శ్రీ లక్ష్మి గణపతి స్వామికి ఓ స్పెషాలిటీ ఉంది.

 Bhikkavolu Ganesh Special Type Of Worship, Bhikkavolu Ganesh , Ganesh , Devotion-TeluguStop.com

 కేవలం విఘ్నరాజుని చెవిలో మన కోర్కెలు చెప్తే. నేరవేరుస్తాడని ప్రతీతి.

 కాణిపాకం, ఐనవల్లి వినాయక ఆలయాల్లాగానే బిక్కవోలు గణపతి ఆలయం ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం క్రీ. శ.9 వ శతాబ్దంలో తూర్పు చాణక్యుల కాలంలో క్రీ. శ.849 మధ్య క్రీ. శ.892 లో నిర్మించారు. ఇది నవాబుల కాలంలో విచ్ఛిన్న సమయంలో ఈ ఆలయం భూగర్భం లోకి వెళ్లిపోయింది.

తరువాత 1960 వ సంవత్సరంలో ఒక భక్తుని కలలో కనిపించిన లంబోధరుడు. నేను భూమిలో ఉన్నాను అని చెప్పారు. అక్కడ తవ్వకాలు జరపగా ఆలయం ధర్శనమిచ్చింది. విగ్రహం బయటపడిన కొత్తలో చిన్నగా ఉంది. తరువాత భారీగా పెరిగింది అని ఇక్కడి భక్తులు అంటున్నారు.

 అతిపెద్ద గణపతి శిలా విగ్రహాల్లో ఇది కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ వినాయకుడి విగ్రహం అసలు భూమి లోపల ఎంత అడుగుల వరకు ఉందో అంతుచిక్కని రహస్యం.

 ఈ స్వామికి చెవిలో ఏది చెప్తే అది జరుగుతుంది అని స్థానికుల నమ్మకం.ప్రతి నెలా శుద్ధ చవితి నాడు లక్ష దూర్వ బిలాలతో పూజ, మూల మంత్ర జప తర్పణ హోమాలు, అభిషేకాలు, ఏకా దశ, గణపతి,రుద్ర, చండి హోమాలు చేస్తారు.

 ఈ ప్రాంగణంలో ఇంకా రాజ రాజేశ్వరీ చంద్రశేఖర, గొలింగేశ్వర, పార్వతి, సుబ్రమణ్య స్వామి,నంది, నవ గ్రహాలు ఇలా శైవ కుటుంబం అంతా కొలువై ఉంది.

Bhikkavolu Ganesh Special Type Of Worship, Bhikkavolu Ganesh , Ganesh , Devotional , Andrapradesh - Telugu Devotional, Ganesh Temple, Vinayaka Temple

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube