మనలో చాలా మందికి ప్రస్తుత కాలంలో సరైన వివాహ సంబంధాలు( Marriages ) కుదరగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.అంతే కాకుండా పెళ్లి ప్రస్తావన విషయంలో కూడా చాలా మంది సమస్యలను ఎదుర్కొంటున్నారు.
సరైన వయసులో పెళ్లి కుదరకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి.అంతే కాకుండా సమాజంలో కూడా సరైన రెస్పెక్ట్ ఉండదు.
ఒకప్పుడు పెళ్లిళ్లు కుదుర్చుకోవడానికి పెళ్లిళ్ల పేరయ్యాలను సంప్రదించేవారు.మతవిశ్వాసాల ప్రకారం జ్యోతిష్యులు సరైన పెళ్లి సంబంధం కుదరడానికి అనేక పరిహారాలు చెబుతూ ఉంటారు.
మీరు శ్రావణ మాసంలో( Sravana Masam ) ప్రతి సోమవారం ఉపవాసం( Fasting ) ఉంటే మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

అంతే కాకుండా అమ్మాయిలకు మనసుకు నచ్చిన వ్యక్తి భర్తగా వస్తాడు.అబ్బాయిలకు వారి అనుగుణంగా ఉండే అమ్మాయి భార్యగా దొరుకుతుంది.అప్పుడు మీకు మంచి భర్త లభిస్తాడు.
మీ వివాహంలో సమస్యలు ఉంటే సోమవారం రోజు ఉపవాసం ఉండడం వల్ల అన్ని సమస్యలు దూరం అవుతాయి.అలాగే ఈ ఏడాది శ్రావణమాసం జులై 4వ తేదీ నుంచి మొదలవుతుంది.
శ్రావణమాసంలో మహాదేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు అనేక చర్యలు తీసుకుంటారు.శ్రావణమాసం శివునికి ఎంతో ఇష్టమైనదిగా పండితులు చెబుతున్నారు.

ఈ సారి శ్రావణ మాసం 2 నెలల పాటు ఉంటుంది.శ్రావణ మాసంలో 8 సోమవారాలు ఉంటాయి.ఈ సారి శ్రావణమాసంలో అనేక ప్రత్యేక యాదృచ్ఛికాలు కూడా జరగనున్నాయి.అటువంటి పరిస్థితిలో శ్రావణమాసంలో భోలేనాథ్‌ను ప్రసన్నం చేసుకోవడానికి శివ భక్తులు తమలైన రీతిలో పూజలు చేస్తారు.
శ్రావణమాసంలో భోలేనాథ్ ను మాత్రమే కాకుండా పార్వతీమాతను కూడా పూజించాలని మన పెద్దలు చెబుతుంటారు.అలాగే శివాలయాలకు వెళ్లి నియమాలు ప్రకారం శివుని పూజించాలి.ఆ తర్వాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి.అంతేకాకుండా శ్రావణమాసంలో వివాహం కానీ అబ్బాయిలు, అలాగే వివాహం కాని అమ్మాయిలు పసుపు రంగు దుస్తులు ఎక్కువగా ధరించడం మంచిది.
పసుపు రంగు దుస్తువులు ధరించి శివలింగానికి నీరు సమర్పించడం వల్ల త్వరగా వివాహం అవుతుంది.
DEVOTIONAL