జీవితం ప్రశాంతంగా సాగిపోవాలంటే ఖచ్చితంగా సరైన సంపద ఉంటే మాత్రం సరిపోదు.ఇల్లు, ఇల్లాలు అంతా సంతోషంగా ఉండాలి.
అలాగే వాస్తు ప్రకారం జీవితంలో ఎలాంటి దోషాలు ఉన్నా ఆ ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది.అందుకే జీవితం సాఫీగా సాగిపోవడానికి ఎన్నో వాస్తు నియమాలను పాటించాల్సి ఉంటుంది.
మరి ముఖ్యంగా కొత్త ఇంటినీ నిర్మించే సమయంలో కొన్ని ప్రాథమిక వాస్తు నియమాలను తెలుసుకోవడం చాలా అవసరం.అలాంటి వాటిలో ముఖ్యమైనది నీటి ట్యాంకు( Water tank ).ట్యాంక్ ను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు.కచ్చితంగా ఒక దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి.
అలాంటప్పుడే మీరు ప్రశాంతంగా ఇంట్లో జీవించగలరు.అయితే ఇంటి నిర్మాణం సమయం లో నీటి ట్యాంకులు ఎక్కడ ఉండాలన్న సందేహాలు చాలామందిలో వస్తూ ఉంటాయి.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఒక చక్కని పరిష్కారం ఉంది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఇంటి నిర్మాణంలో రెండు రకాల వాటర్ ట్యాంకులు ఉంటాయి.ఒకటి భూగర్భంలో నిర్మించే సంపు, రెండోది పైకప్పు మీద ఉండే ఓవర్ హెడ్ ట్యాంక్.అయితే భూమి లోపల నిర్మించే సంపును( Sampunu ) ఈశాన్యంలో నిర్మించడం ఉత్తమం.అలాగే తూర్పు ఉత్తర గోడలకు తగలకుండా నిర్మాణం చేయడం మంచిది.అంతేకాకుండా సంపు నైరుతి, ఆగ్నేయంలో నిర్మించడం అస్సలు మంచిది కాదు.అలా నిర్మించడం వలన ఇంట్లో నిరంతరం ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడతారు.
ఇక వాయువ్యంలో నిర్మిస్తే ఇంట్లో గందరగోర పరిస్థితులు ఏర్పడతాయి.ఇక దక్షిణాన నిర్మిస్తే ఇంట్లో స్త్రీలు రోగాల బారినపడే అవకాశం ఉంది.
అలాగే పడమర దిక్కులో నిర్మిస్తే పురుషులకు రోగాల బాధ కచ్చితంగా తప్పదు.అందుకే నీటి సంపును ఎప్పుడు ఈశాన్యం లో నిర్మించుకోవడం మంచిది.
కుదరని పక్షంలో తూర్పున నిర్మించుకోవడం మంచిది.

ఇక ఇంటి నిర్మాణం సమయంలో ఓవర్ హెడ్ ట్యాంక్( Overhead tank ) నైరుతి మూలన నిర్మిస్తే మంచిది.అయితే నైరుతి మూలన కుదరనప్పుడు పశ్చిమాన లేదా దక్షిణంలో పెట్టుకోవచ్చు.అంతేకానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఈశాన్యంలో మాత్రం దీన్ని ఉంచకూడదు.
ఇలా ఉంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఘోరంగా వెంటాడుతాయి.ఇది సంపద, నష్టానికి, నిరాశకు మూలమవుతుంది.