టాలీవుడ్ ఇండస్ట్రీలో దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన కథలతో సినిమాలు కొత్తేం కాదు.ఈ జానర్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ తరహా సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది.
ఈ జానర్ సినిమాలను తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించడంతో పాటు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు వస్తాయని చెప్పవచ్చు.రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో తీస్తున్న సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
అయితే కొన్నేళ్ల క్రితం దెయ్యం, ఆత్మల కాన్సెప్ట్ తో ఆర్జీవీ రాత్రి, భూత్, దెయ్యం, మరికొన్ని సినిమాలను తీశారు.తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విరూపాక్ష( Virupaksha ) సినిమాలో చేతబడులు, దెయ్యాలు, ఆత్మలను ప్రధానంగా చూపించారు.
అయితే 1991 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీశారు కాబట్టి ప్రేక్షకులకు సైతం ఈ సినిమా తెగ నచ్చేసింది.విరూపాక్ష వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్లను సాధిస్తోంది.

మారుతి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ప్రేమకథా చిత్రమ్( Premakatha Chitram ) హర్రర్ కామెడీగా తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రాజుగారి గది( Rajugari Gadi ) సిరీస్ సినిమాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.మారుతి, ఓంకార్ దెయ్యాల కాన్సెప్ట్ ను ఎంచుకున్నా కామెడీ ప్రధానంగా సినిమాలను తెరకెక్కించారు.రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన అవును, అవును2 సినిమాలు సైతం ప్రేక్షకులను భయపెట్టి ఆకట్టుకున్నాయి.

ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు థ్రిల్ కు గురి చేస్తూ దర్శకులు విజయాలను అందుకుంటున్నారు.రాబోయే రోజుల్లో దెయ్యాలు, అత్మలకు సంబంధించిన కాన్సెప్ట్ లతో మరిన్ని సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కాలేదు.నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా కూడా హర్రర్ కాన్సెప్ట్ లో తెరకెక్కి ఆకట్టుకుంది.







