ఈ భూమి పై జీవిస్తున్న ఎవరు కూడా పేదరికన్ని కోరుకోరు.డబ్బులు లేకుండా బాధపడాలని అస్సలు అనుకోరు.
ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు.అయితే ఆర్థిక పరిస్థితుల్ని బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇలా చేయాలి.
వీటిని కనుక మీరు పాటించారంటే కచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితి( Financial situation ) మెరుగుపడుతుంది.ఎప్పటికీ ఎటువంటి లోటు ఉండదు.

మీరు కచ్చితంగా ధనవంతులవుతారు.ముఖ్యంగా చెప్పాలంటే మీ వంట గదిలో శుభ్రతను పాటించాలి.వంట గది బాగుంటే డబ్బు దాని అంతట అదే వస్తుంది.వంటిల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ( Laxmi Devi )ఆ ఇంట కొలువై ఉంటుంది.అలాగే ఇంటి అలంకరణలో జేడ్ ప్లాంట్ ని ఉంచాలి.ఈ జేడ్ ప్లాంట్ ని పెడితే డబ్బును ఆకర్షిస్తుంది.
ఇది కుటుంబ సభ్యులకి సంపాదనను కూడా ఇస్తుంది.ఇది విజయాన్ని కూడా అందిస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారానికి ఎరుపు రంగు వేసుకుంటే ప్రతికూల శక్తి దూరమైపోతుంది.అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది.లక్ష్మీదేవి మీ ఇంట అలాగే కొలువై ఉంటుంది.లాఫింగ్ బుద్ధ( Laughing buddha ) ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా మీ సంపాదన పెరుగుతుంది.
అదృష్టం కూడా కలిసి వచ్చి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.రోజు మొక్కలకి నీళ్లు పోయడం, మట్టిని మార్చడం, కొత్త పువ్వులు పూయడం లాంటి ఇల్లు ఉంటే కచ్చితంగా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెబుతున్నారు.
అలాగే మీరు చేసే ఏ వ్యాపారంలోనైనా ఆదాయం పెరుగుతుంది.ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉత్తరం వైపు ఒక చేపలా తొట్టిని పెడితే కూడా ఆ ఇంటికి ధనలక్ష్మి వస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే ఒక చిన్న వాటర్ ఫౌంటన్ని ఇంట్లో పెట్టడం వల్ల కూడా మీ సంపద పెరుగుతుంది.