జగన్ VS చంద్రబాబు@ఏపీ నాయకులు..దెబ్బకు దెబ్బ తీస్తారా..?

ఒక వేలు నీ వైపు చూపిస్తే నాలుగు వేళ్లు నా వైపు చూపిస్తాయి అన్నట్టుగా ఏపీ రాజకీయాల్లో ( AP Politics ) ఇప్పుడు ఇదే తతంగం కొనసాగుతుంది.టిడిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు వేలు జగన్ వైపు చూపించింది.

 Jagan Vs Chandrababu Ap Leaders-TeluguStop.com
Telugu Ap, Chandrababu, Roja, Skill Scam, Ys Jagan-Politics

అక్రమాస్తుల కేసులో జగన్ ( Jagan ) ను దాదాపు 16 నెలల పాటు జైలుకే పరిమితం చేశారు చంద్రబాబు అండ్ బ్యాచ్.దీంతో దెబ్బకు దెబ్బ కొట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా చంద్రబాబు చేసినటువంటి తప్పును వెలికి తీసి చంద్రబాబును కూడా జైలుకు పంపించారు.ఈ విధంగా ఎవరు అధికారంలో ఉంటే ప్రతిపక్ష నాయకుల తప్పులను వెలికి తీసి జైలుకు పంపించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆనవాయితీగా మారుతుంది.

కేవలం చంద్రబాబు ( Chandrababu ) నే కాకుండా టిడిపి నాయకుల పై కూడా అక్రమ కేసులు పెడుతూ ఈ మధ్యకాలంలో జైలుకు వెళ్లిన పరిస్థితులు అనేకం ఉన్నాయి.

అలాగే టిడిపి అధికారంలో ఉన్నప్పుడు జగన్ పార్టీ నాయకులను కూడా కొంతమంది పై అక్రమ కేసులు( Illegal Cases ) పెట్టి జైలుకు పంపిన దాఖలాలు అనేకం ఉన్నాయి.పార్టీ పదవులు అనేవి శాశ్వతం కాదు.

కానీ ఇద్దరు నాయకుల బలాబలాలు చూపించుకోవడం వల్ల మిగతా నాయకులు భయపడుతున్నారు.

Telugu Ap, Chandrababu, Roja, Skill Scam, Ys Jagan-Politics

ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనేది జగమెరిగిన సత్యం.బాబు అధికారంలో ఉన్న సమయంలో కేవలం జగన్ పైనే కక్ష సాధింపు చర్యలు చేపట్టకుండా రోజా( Roja ), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా ఇతర నాయకులపై గురిపెట్టి మరీ చంద్రబాబు అటాక్ చేయించారు.ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

రవీంద్ర, అచ్చన్నాయుడు, చంద్రబాబు ఇంకెంతమందిని అరెస్టు చేయిస్తారో తెలియదు.ఇలా అగ్ర నాయకుల కక్ష సాధింపు చర్యల్లో ఏపీ రాజకీయ నాయకుల పై వేటు పడుతుందని చెప్పకనే చెప్పవచ్చు.

దీంతో వైసిపి ( YCP ) వాళ్లు కూడా కాస్త భయాందోళన చెందుతున్నారట.అధికారం ఎప్పుడు శాశ్వతంగా ఉండదు.ఒకవేళ అధికారం నుంచి దిగిపోతే చంద్రబాబు ఊరుకుంటాడా.మళ్లీ మా పై దాడులు చేయించడా అనే ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.

ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కక్ష సాధింపు చర్యలుగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube