స్పాట్ లెస్ స్కిన్ కోసం ఆరాటపడేవారు ఎందరో ఉన్నారు.ముఖ్యంగా మగువలు మచ్చలేని చర్మం కావాలని తెగ కోరుకుంటారు.
ఈ క్రమంలోనే ఖరీదైన క్రీమ్‌లు, సీరమ్స్ వాడుతుంటారు.అలాగే ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాలు అన్నీ ప్రయత్నిస్తుంటారు.
మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను మీరు పాటించాల్సిందే.
ఈ చిట్కా చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్న క్రమంగా మాయం చేసి ముఖాన్ని అందంగా మరియు ఆకర్షణీయంగా మారుస్తుంది.మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కంది పప్పు, వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, వన్ టేబుల్ స్పూన్ వైట్ రైస్, వన్ టేబుల్ స్పూన్ పొట్టు పెసలు, నాలుగు బాదం పప్పులు వేసుకుని వాటర్ తో రెండు సార్లు వాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత అందులో ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలను పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టుకున్న పదార్థాలను కొబ్బరి పాలతో సహా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి అప్లై చేసుకోవాలి.ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.
అనంతరం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే చాలు ఎలాంటి మచ్చలు ఉన్నా కేవలం కొద్ది రోజుల్లోనే తగ్గు ముఖం పడతాయి.అదే సమయంలో చర్మం స్మూత్ అండ్ షైనీగా మారుతుంది.
స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.మరియు ముఖం అందంగా, కాంతివంతంగా సైతం మెరుస్తుంది.