తమిళ సూపర్ స్టార్స్ అంతా ఇకనుండి హైదరాబాద్‌లోనే ఉంటారట!

అవును, మీరు వింటున్నది నిజమే.ఇకనుండి తమిళ సూపర్ స్టార్స్ అంతా హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నారు.

 Tamil Stars Shooting Updates In Hyderabad Vijay Ajith Dhanush Details, Sivakarth-TeluguStop.com

అన్నపూర్ణ 7 ఎకరాలలో విజయ్, అల్యూమినియం ఫాక్టరీలో అజిత్, ఆర్టీసి క్రాస్ రోడ్స్ లో ధనుష్, నానక్ రామ్ గూడలో శివకార్తికేయన్ ఇలా తమిళనాడు టాప్ స్టార్స్ అంతా హైదరాబాద్ లో సందడి చేస్తున్నారు.ఇక దేనికోసమో వేరే చెప్పాల్సిన పనిలేదు.

అవును.సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వారు వచ్చారు.

తమిళ స్టార్ విజయ్ 66 మూవీని వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసినదే కదా.ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్ లో జరుగుతుంది.

అజిత్ సినిమా షూటింగ్ విశేషాలు:

విజయ్ తో పాటు తమిళ్ సీనియర్ యాక్టర్స్ శరత్ కుమార్, ప్రభులతో పాటూ ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, జయసుధ లాంటి సీనియర్ యాక్టర్స్ ఈ సినిమాలో నటించడం విశేషం.ఇక అజిత్ హీరోగా వినోద్ H దర్శకత్వంలో బోనీకపూర్ నిర్మిస్తున్న AK 61 సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండటం విశేషం.

వలిమై తర్వాత అజిత్ తో మరోసారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు బోనీ కపూర్. వలిమై ప్లాప్ గా మిగిలిపోవడంతో ఈ సినిమాతో ఎలాగున్నా హిట్ కొట్టాలని చూస్తున్నాడు బోని.

Telugu Dhanush, Kollywood Stars, Hyderabad, Sivakarthikeyan, Tamil Stars, Venky

ధనుష్, శివకార్తికేయన్ సినిమా విశేషాలు:

ఇకపోతే ధనుష్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ నిర్మిస్తున్న సినిమా సార్.ఈ సినిమా షూటింగ్ RTC క్రాస్ రోడ్స్ ఉష మయూరి థియేటర్ లో ముమ్మురంగా జరుగుతోంది.ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఓ 7 రోజులు పాటు ఇక్కడే జరగనుంది.అలాగే తమిళనాట వరస సక్సెస్ లతో దూసుకుపోతున్న హీరో శివకార్తికేయన్ కూడా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటున్నాడు.

రాజ్ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జరుగుతుంది.దాదాపు ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యుల్ ఇక్కడ జరుగనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube