గల్ఫ్ కష్టాలు : యజమాని చెరలో నరకం.. ఎంపీ చొరవతో స్వదేశానికి పంజాబ్ మహిళ

ఆర్ధిక ఇబ్బందులు( Financial difficulties ) కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.

 Punjab Woman Returns Traumatised, Empty-handed From Gulf , Financial Difficultie-TeluguStop.com

ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు.

కానీ అక్కడ అడుగుపెడితే కానీ అసలు విషయం తెలియదు.గల్ఫ్ గోసలు అంతా ఇంతా అని చెప్పలేము.

గల్ఫ్ కష్టాలు పగవాడికి కూడా రావద్దని అక్కడి నుంచి తిరిగి వచ్చిన బాధితులు చెబుతుంటారు.కార్మికులను మభ్యపెట్టి సందర్శకుల పేరిట వారిని ట్రావెల్‌ ఏజెంట్లు తరలించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.

గడువు ముగిసిన తరవాతా వీరు అక్కడే ఉండిపోతున్నారు.అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో వీసాలు, పాస్‌పోర్టులు( Visas , passports ) లేనివారు రహస్యంగా జీవిస్తున్నారు.

భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని అక్కడి సంస్థలు, యజమానులు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.

Telugu Financial, Gulf, Muscat, Nakodar Punjab, Oman, Punjab, Punjab Returns, Ra

అలా దేశం కానీ దేశంలో యజమాని చెరలో మగ్గిపోయి ఎట్టకేలకు స్వదేశం చేరుకుంది పంజాబ్‌లోని నకోదర్‌కు( Nakodar in Punjab ) చెందిన 24 ఏళ్ల మహిళ.ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయిన ఆమెను రాజ్యసభ ఎంపీ సంత్ బల్బీర్ సింగ్ సీచెవాల్( Rajya Sabha MP Sant Balbir Singh Sechewal ) ప్రత్యేకంగా చొరవ చూపి మస్కట్ నుంచి స్వదేశానికి తీసుకొచ్చారు.మస్కట్‌లో తనను శారీరకంగా, మానసికంగా హింసించారని ఆ మహిళ వాపోయింది.

తన కుటుంబం కోసం దుబాయ్‌లో ఏదైనా పని చూసుకుందామని గల్ఫ్ వెళ్లినట్లుగా ఆమె చెప్పింది.తనను వారం రోజులు దుబాయ్‌లో ఉంచి, ఆపై మస్కట్‌కు తరలించారని అక్కడ ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేశానని బాధితురాలు తెలిపింది.

అక్కడ ఉన్న నాలుగు నెలలు తాను నరకం చూశానని.యజమాని కొట్టేవారని, కొన్నిసార్లు భోజనం కూడా పెట్టేవారు కాదని కన్నీటి పర్యంతమైంది.

Telugu Financial, Gulf, Muscat, Nakodar Punjab, Oman, Punjab, Punjab Returns, Ra

కాగా.గతేడాది కూడా గల్ఫ్‌లో మగ్గిపోయిన ఐదుగురు మహిళలను ఎంపీ సంత్ బల్బీర్ సింగ్ సీచెవాల్ స్వదేశానికి రప్పించారు.మస్కట్, ఒమన్‌లలో( Muscat, Oman ) భారీ జీతాలు ఆశపెట్టి వీరు ఐదుగురిని ట్రావెల్ ఏజెంట్లు బుట్టలో వేసుకున్నారు.తీరా అక్కడికి వెళ్లాక గానీ తాము మోసపోయినట్లు వీరు గ్రహించలేకపోయారు.

గంటల తరబడి పనిచేయించుకుని తక్కువ జీతాన్ని వీరి చేతిలో పెట్టారు.దీనికి తోడు శారీరకంగా, మానసికంగా వేధింపులు సైతం ఎదుర్కొన్నారు.

ఈ ఐదుగురు బాధితులు పంజాబ్‌లోని జలంధర్, ఫిరోజ్‌పూర్, మోగా, కపుర్తలా జిల్లాలకు చెందినవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube