మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈయన శంకర్( Shankar ) డైరెక్షన్లో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
శంకర్ సినిమా పూర్తి అయిన వెంటనే ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు( Bucchi Babu ) డైరెక్షన్లో మరో సినిమాకి కమిట్ అయిన సంగతి మనకు తెలిసినదే.ఇప్పటికే ఈ సినిమా ఎంతో ఘనంగా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు జరగనున్నాయి.

ఇలా ఈ సినిమా పట్ల ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన దివంగత నటి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ విడుదల చేశారు.
ఈ సినిమాలో పలువురు ఇతర భాష స్టార్ సెలబ్రిటీలు కూడా భాగమవుతున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలను కూడా ఈ చిత్రంలో భాగం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు శివరాజ్ కుమార్ ఒకరు.ఈయన కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక శివరాజ్ కుమార్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సౌత్ సినిమాలలో క్యామియో రోల్స్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.ఇక నేడు శివరాజ్ కుమార్( Shiva Raj Kumar ) పుట్టినరోజు కావడంతో RC 16 నుంచి ఈయన పోస్టర్ విడుదల చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ఈ సినిమాలో నటిస్తున్నట్లు కూడా అధికారకంగా వెల్లడించారు.
ఇలా పలువురు స్టార్స్ నటిస్తున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.







