దగ్గు.( Cough ) పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరిని అత్యంత సర్వసాధారణం గా వేధించే సమస్యల్లో ఒకటి.
పైగా అంటు వ్యాధి లాగా ఇంట్లో ఒకరికి దగ్గు పట్టుకుంది అంటే మిగిలిన వారందరికీ కూడా వ్యాప్తి చెందుతుంది.దగ్గు కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.
పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది.రాత్రుళ్లు నిద్ర కూడా సరిగ్గా పట్టదు.
మీరు కూడా దగ్గుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా.? అయితే వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని పాటిస్తే చాలా సులభంగా మరియు వేగంగా దగ్గు నుంచి విముక్తి పొందవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో పది మిరియాలు, ఐదు లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసి బాగా కలపాలి.
చివరిగా పావు టేబుల్ స్పూన్ అల్లం రసం, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు అంటే ఉదయం సాయంత్రం వన్ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి.ఇలా చేస్తే అందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ దగ్గును సమర్థవంతంగా తగ్గిస్తాయి.రెండు రోజుల్లోనే దగ్గు నుంచి విముక్తిని అందిస్తాయి.
కాబట్టి ఎవరైతే తీవ్రమైన దగ్గుతో బాధ పడుతున్నారో తప్పకుండా వారు ఈ హోమ్ రెమెడీని పాటించండి.

అలాగే మరొక విధంగా కూడా దగ్గును నివారించుకోవచ్చు.అందుకోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అంగుళం దాల్చిన చెక్క, నాలుగు లెమన్ స్లైసెస్, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని తేనె కలిపి సేవించాలి.ఈ డ్రింక్ ను రోజుకు ఒకసారి తీసుకున్న సరే దగ్గు దెబ్బకు పరార్ అవుతుంది.







