జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జనసేనాని రుషికొండ పర్యటన పేరుతో హడావుడి చేశారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే రుషికొండలో నిర్మాణాలపై పవన్ కు ఎందుకంత బాధ అని ప్రశ్నించారు.
కొండపై ఉన్న కట్టడాలు పవన్ కనిపించడం లేదా అని నిలదీసిన మంత్రి రోజా హైదరాబాద్ లో పవన్ ఇల్లు కొండపై లేదా అని అడిగారు.
మరి దాని గురించి పవన్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.రుషికొండపై కావాలనే పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ పరిపాలనా రాజధానిగా రాకూడదనే కక్షతోనే చంద్రబాబు, పవన్ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.







