ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే ఎంత మంచిదో తెలుసా?

మానవుని జీవితం ఎన్నో అలవాట్లతో నిండివుంటుంది.ప్రతిరోజు మన జీవన విధానాన్ని సాగించాలంటే ఈ అలవాట్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.

 Best Morning Habits For Peaceful Life, Life, Early Morning, Prayers, Mobile Phon-TeluguStop.com

మనం నేర్చుకున్న అలవాట్లను బట్టి మన వ్యక్తిత్వాన్ని పసిగడతారు.మంచి అలవాట్లను కలిగి ఉంటే ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది.

కానీ చెడు అలవాట్లకు బానిస అయితే వారి జీవితం ప్రమాదంలో పడి కష్టనష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.మన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా సాగిపోవాలంటే ఉదయం లేవగానే అలవాట్లను తప్పకుండా పాటించాలి.
ఉదయం నిద్ర లేవగానే మన చేతులను జోడించి నమస్కారం పెట్టుకున్న తర్వాత మన అరిచేతులను చూడాలి.అరచేతినీ చూస్తూ మన ఇష్ట దైవాన్ని ప్రార్థించడం వల్ల రోజంతా ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది.

అలాగే నిద్ర నుంచి ముందుగా మనం పెట్టే మొదటి అడుగు నేలపైన కాబట్టి ముందు భూమాతను నమస్కరించాలి.ఇలా చేయడం ద్వారా భూమాత నుంచి ఆశీర్వాదం పొందటం వల్ల తమ జీవితంలో సుఖ సంతోషాలతో పాటు సిరి సంపదలు కూడా పెరుగుతాయని మన పెద్దలు భావిస్తుంటారు.

మన హిందూ పురాణాల ప్రకారం ఆవును ఎంతో ప్రధానమైనది గా పూజిస్తారు.ఆవులో ఎంతో మంది దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి-.

అందువల్ల ఉదయం లేవగానే ఆ గోమాతను పూజించడం ద్వారా సకల దేవతల ఆశీర్వాదం మనపై ఉంటుంది.అంతేకాకుండా మనం ప్రతి రోజు చేసే అల్పాహారం ఆ గోవుకు పెట్టడం ద్వారా ఆ లక్ష్మీ దేవత మన ఇంట్లో కొలువై ఉంటుందని భావిస్తారు.

ఆవుపేడతో మన ఇంటి ముందు కల్లాపి చల్లడం వల్ల సర్వరోగాలు తొలగిపోయి ఆయురారోగ్యాలతో ఉంటారు.

ఇలాంటి మంచి అలవాట్లు ఏమాత్రం పాటించకుండా ప్రస్తుతం ఉదయం లేవగానే సెల్ ఫోన్ చేతులో పట్టుకుని లేవడం తోనే వారి దినచర్యను ప్రారంభిస్తున్నారు.

ఇలా చేయడం ఎలా మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు మనల్ని తన నియంత్రణలో ఉంటుంది.ఉదయం లేవగానే చల్లని నీటితో మొహం కడిగి దేవుళ్ళను నమస్కరించి తదుపరి మన కార్యక్రమాలను ప్రారంభించాలి.

ఇలాంటి కొన్ని అలవాట్లను ప్రతిరోజు పాటించడం వల్ల ఆరోగ్యంతో పాటు, ఆర్థికంగా కూడా ముందంజలో ఉంటారని వేద పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube