విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడాలతో పాటు భారతీయ యువతకు బాగా ఇష్టమైన దేశాల్లో యూకే కూడా ఒకటి.
ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జీ వర్సిటీలు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు భారతీయ విద్యార్ధులను ఆకర్షిస్తున్నాయి.పెరుగుతున్న వలసల నేపథ్యంలో స్టూడెండ్ వీసాపైనా ఆంక్షలు ఎదురవుతున్నాయి.
ఇదిలాఉండగా.యూకే ప్రభుత్వం ‘‘యూకే – ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ ’’ (UK Government’s ”UK-India Young Professionals”)స్కీమ్ 2025 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.
ఈ స్కీమ్ కింద భారతీయ యువకులకు రెండేళ్ల వరకు యూకేలో నివసించడానికి, పనిచేయడానికి, చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది.

2025 సంవత్సరానికి గాను ఈ పథకం కింద మొత్తం 3,000 వీసాలు అందుబాటులో వున్నాయి.యూకే వీసాల(UK visas) కోసం గ్రాడ్యుయేట్ స్థాయి అర్హతలు కలిగిన 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల భారతీయులు బ్యాలెట్‌లో(Indians on the ballot) నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.ఈ బ్యాలెట్ ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 20 మధ్య అందుబాటులో ఉంటుందని యూకే ప్రభుత్వం( UK Govt ) పేర్కొంది.
రాండమ్ విధానంలో అధికారులు వీసాలకు ఎంపిక చేస్తారు.అయితే ఇప్పటికే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా (Youth Mobility Scheme Visa)కింద ఉన్న వారిని ఎంపిక చేయరు.యూకేలో తమను తాము పోషించుకోవడానికి వారి వద్ద 2530 పౌండ్లు (భారత కరెన్సీలో రూ.2,70,824) సేవింగ్స్ ప్రూఫ్ దరఖాస్తుదారుల వద్ద ఉండాలి.వారి బ్యాంక్ ఖాతాలో కనీసం 30 రోజుల పాటు రూ.2,50,000 ఉండాలి.బ్యాలెట్‌లో నమోదు చేసుకునే ముందే దరఖాస్తుదారులు అన్ని అర్హతలను నిర్ధారించుకోవాలి.

కాగా.మూడేళ్ల క్రితం ఇండోనేషియాలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, అప్పటి బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ మధ్య ఈ స్కీమ్‌కు సంబంధించి సంతకాలు జరిగాయి.18 నుంచి 30 సంవత్సరాల వయసున్న భారత్- బ్రిటన్ పౌరులు ఏ దేశంలోనైనా కొంతకాలం పాటు నివసించడానికి , పనిచేసుకోవడానికి ఈ యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ వీలు కల్పిస్తుంది.ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు రెండేళ్ల పాటు గ్రాడ్యుయేట్ డిగ్రీ, వారి బసకు అండగా నిలవాలని ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి.