టాలీవుడ్ హీరో సాయితేజ్( hero saitej ) కు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.విరూపాక్ష సినిమాతో సక్సెస్ సాధించిన సాయితేజ్ బ్రో సినిమాతో ఒకింత నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే.
జయాపజయాలకు అతీతంగా సాయితేజ్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.తాజాగా సాయితేజ్ అహోబిలం క్షేత్రానికి వచ్చి ఇక్కడ కొలువై ఉన్న నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు.
ప్రస్తుతం సాయితేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.అభిమానులతో సెల్ఫీలు దిగిన సాయితేజ్ అహోబిల క్షేత్రానికి హాజరు కావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చారు.
స్వామివారిని దర్శించుకోవాలని అభిమానులకు సైతం సాయితేజ్ సూచించారు.ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు షూట్ లో పాల్గొంటున్నానని సాయితేజ్ పేర్కొన్నారు.

నాకు పాలిటిక్స్( Politics ) తో పని లేదని ఆయన తెలిపారు.ప్రస్తుతానికి ఈ పూటకు భోజనం దొరికితే చాలు అని నేను అనుకుంటానని సాయితేజ్ చెప్పుకొచ్చారు.నలుగురికి సహాయం చేస్తూ సినిమాల ద్వారా ఎంటర్టైన్మెంట్ అందిస్తానని సాయితేజ్ వెల్లడించడం గమనార్హం.సాయితేజ్ రెమ్యునరేషన్( Remunaration ) ప్రస్తుతం 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

సాయితేజ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఈ హీరో ఖాతాలో మరిన్ని భారీ విజయాలు దక్కే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.సాయితేజ్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించి సంచలన విజయాలను సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.సాయితేజ్ సినిమాల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.సంబరాల ఏటిగట్టు సినిమా రోహిత్ కేపీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.సంబరాల ఏటిగట్టు సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది.







