పారిస్ లో కాలి బూడిదైన చారిత్రాత్మక కట్టడం

ఫ్రెంచి చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటన తాజాగ చోటు చేసుకుంది.పారిస్ లో అతి పురాతన చర్చి నాట్రడామ్‌ కేథడ్రల్‌ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ అగ్నిప్రమాదంలో చర్చి పైకప్పు, గోపురం పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి మంటల ధాటికి గోపురంలోని మూడింట రెండు వంతుల భాగం కూలిపోయింది.18వ శతాబ్దంలో ద హంచ్‌బ్యాక్‌ ఆఫ్‌ నాట్రడామ్‌ చర్చి ఇలాగే అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది.మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత అలంటి ఘటనతోనే మరో చారిత్రాత్మక నిర్మాణం కూడా దగ్ధం కావడం ప్రజల ఆవేదనకి కారణం అయ్యింది.

 Major Fire Ravages Pariss Iconic Cathedral Of Notre Dame-TeluguStop.com

అచ్చం ఇలాంటి కట్టడాన్నే పునర్నిర్మించాలంటే కనీనం 20ఏళ్లు పడుతుందని నిర్మాణరంగంలోని ప్రపంచ దిగ్గజ కంపెనీలు ప్రకటించాయి.

అందుకు సహకరిస్తామంటూ జర్మనీ, ఇటలీ, రష్యా ముందుకొచ్చాయి.చర్చిని ఆధునీకరించే పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది.

చర్చి గోపురం కలపతో నిర్మితమవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.వాటిని ఆర్పేందుకు 400మంది అగ్నిమాపక సిబ్బంది 15గంటలపాటు కష్టపడాల్సి వచ్చింది.

మంగళవారానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.శిలువ వేయడానికి ముందు జీసస్‌ తలకు తొడిగిన ముళ్ల కిరీటం ఈ చర్చిలోనే భద్రపరిచినట్టు విశ్వసిస్తారు.

ఈ పవిత్ర కిరీటాన్ని ఫైర్‌ సిబ్బంది కాపాడగలిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube