మీ ముఖ చర్మం తరచూ జిడ్డుగా మారుతుందా.. అయితే మీకు బెస్ట్ సొల్యూషన్ ఇదే!

సాధారణంగా కొందరికి ముఖ చర్మం తరచూ జిడ్డుగా( Oily Skin ) మారుతుంటుంది.ముఖ్యంగా ఆయిలీ స్కిన్ కలిగిన వారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది.

 Best Solution To Get Rid Of Greasy Skin!, Greasy Skin, Oily Skin, Home Remedy,-TeluguStop.com

ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకున్నా సరే మళ్ళీ కొద్దిసేపటికి ముఖం మొత్తం జిడ్డుగా తయారవుతుంది.మేకప్ వేసుకుంటే కొన్ని నిమిషాలకే మొత్తం చెదిరిపోతుంది.

ఇలాంటివారు చాలా ఇబ్బంది పడుతుంటారు.ఈ సమస్య నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీ సమస్యకు బెస్ట్ సొల్యూషన్.

Telugu Tips, Skin, Greasy Skin, Remedy, Latest, Oily Skin, Shiny Face, Skin Care

అవును ఈ రెమెడీని కనుక పాటిస్తే జిడ్డు చర్మానికి బై బై చెప్పవచ్చు.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పీల్ తొలగించి కట్ చేసిన నాలుగు బొప్పాయి పండు ముక్కలు, అరకప్పు ఫ్రెష్ అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకుని స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రాండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, చిటికెడు పసుపు( Turmeric ), వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ పై చర్మాన్ని సున్నితంగా రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ అండ్ వండర్ ఫుల్ హోమ్ రెమెడీ( Home Remedy )ని రెండు రోజులకు ఒకసారి కనుక పాటిస్తే చాలు అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.

Telugu Tips, Skin, Greasy Skin, Remedy, Latest, Oily Skin, Shiny Face, Skin Care

దాంతో మీ చర్మం తరచూ జిడ్డు జిడ్డుగా మారకుండా ఉంటుంది.అదే సమయంలో మీ స్కిన్ వైట్ గా బ్రైట్ గా మెరుస్తుంది.అంతేకాదు ఈ రెమెడీ లో వాడిన బొప్పాయి( Papaya ) చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.ముడతలు, చర్మం సాగడం, గీతలు వంటి వృద్ధాప్య ఛాయలు దరిదాపుల్లోకి అడ్డుకట్ట వేస్తుంది.

మ‌రియు స్కిన్ ను యవ్వనంగా సైతం మెరిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube