మెగాస్టార్ చిరంజీవి( Megastar chiranjeevi ) ఆచార్య సినిమా ఫలితం తర్వాత కథల ఎంపిక విషయం లో చాలా జాగ్రత్త పడుతున్నాడు.ఏమాత్రం అజాగ్రత వహించడం లేదు.
ముఖ్యంగా రీమేక్ ల విషయం లో ఆసక్తి చూపడం లేదు.వేదాళం రీమేక్ గా భోళా శంకర్ సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
అంతకు ముందు లూసీఫర్ ని గాడ్ ఫాదర్ గా తీసుకు వచ్చాడు.

రెండు సినిమా లు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి అనడంలో సందేహం లేదు.ఆ రెండు సినిమా ల్లో భోళా శంకర్( Bholaa Shankar ) డిజాస్టర్ అన్నట్లుగా నిలిచింది.మరీ ఇలాంటి ఫలితం ఏంట్రా బాబు అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేశారు.
అందుకే చిరంజీవి చేయాలి అనుకున్న బ్రో డాడీ కూడా చేయకూడదు అనుకున్నాడు.ఇప్పటికే వశిష్ఠ ( Mallidi Vasishta )దర్శకత్వం లో ఒక డైరెక్ట్ స్టోరీ సినిమా ను చేసేందుకు ఓకే చెప్పాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఆ సినిమా షూటింగ్ ని వచ్చే నెలలో ప్రారంభించబోతున్నారు.

మరో వైపు ఆ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.2024 లో ఇంకో కొత్త సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఆ కొత్త సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
కథ ను చిరు ఓకే చేశాడు.అతి త్వరలోనే కొత్త సినిమా అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి యొక్క రెండు కొత్త సినిమా లు వచ్చే ఏడాది రాబోతున్నాయి.రెండు కూడా కొత్త కథలే అవ్వడం తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రీమేక్ కాకుండా డైరెక్ట్ సినిమా లను చిరంజీవి చేయడం అనేది గొప్ప విషయం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ కూడా ప్రస్తుతం అదే కోరుకుంటున్నారు.







