ఆరోగ్యంగానే కాదు అందంగా కూడా ఉండాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు.అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సులభంగా మెరుగుపరుచుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ జ్యూస్ రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి మరియు అందానికి ఎంతో మేలు చేస్తాయి.
వారంలో మూడు సార్లు ఈ జ్యూస్ ని గనుక తీసుకుంటే అందం, ఆరోగ్యం రెండూ రెట్టింపు అవ్వడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటి.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.
ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక కప్పు బొప్పాయి ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి.
అలాగే అర అంగుళం అల్లం ముక్కను కూడా తీసుకుని పీల్ తొలగించి పెట్టుకోవాలి.చివరిగా రెండో ఆరెంజ్ పండ్లు తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో క్యారెట్ ముక్కలు, బొప్పాయి ముక్కలు, పొట్టు తొలగించిన అల్లం మరియు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో ఆరెంజ్ జ్యూస్ ను కూడా మిక్స్ చేసుకుని డైరెక్ట్ గా తాగేయడమే.ఈ జ్యూస్ సూపర్ టేస్ట్ గా ఉండడమే కాదు ఎన్నో బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది.

వారంలో కనీసం మూడు సార్లు ఈ జ్యూస్ ను తాగితే రక్తహీనత పరార్ అవుతుంది.గుండె ఆరోగ్యవంతంగా మారుతుంది.రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.కంటి చూపు మెరుగుపడుతుంది.వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ తగ్గుతుంది.చర్మం యవ్వనంగా నిగారింపు గా మారుతుంది.
వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.మరియు స్కిన్ టోన్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.
కాబట్టి అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని భావించేవారు కచ్చితంగా ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోండి.