మీరు చాలా బాధలు పడుతున్నామని అందుకుంటే చాలా చిన్న ప్రయత్నంతో సదరు బాధల నుంచి ఉపశమనం పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు.చాలామందిని చూస్తే, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తారు.
ఆందోళనకు గురి అవుతూ కనిపిస్తారు.ఎదో అయిపోతున్నట్లు ఫీలవుతూ ఉంటారు.
అదే అతి చిన్న ప్రయత్నం ద్వారా బాధల నుంచి విముక్తి పొందవచ్చు.
ఉదయం లేవగానే భూమికి నమస్కరించి , దేవుడికి నమస్కరించి,దైనందిన పనుల్లో నిమగ్నం అవ్వాలి.ఇక బయటకు వెళ్లేముందు భార్యతో గానీ, తల్లితో గానీ మాట్లాడి,ఒక్కరూపాయి వాళ్ళ చేత స్వీకరించి జేబులో వేసుకుని వెళ్తే, ఇక మీకు బ్రహ్మ యోగం పట్టినట్లేనని కొందరు పండితులు అంటున్నారు.
ఇక శనివారం ఉదయం నాలుగు గంటలకు అంటే దాన్ని శని ఉషక్కాలం అంటారు.
శనివారం రోజు మాత్రమే శని ఉషక్కాలం ఉంటుంది.ఆసమయంలో దీపారాధన చేస్తే మనకు గల ఇబ్బందులన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి.
ఇబ్బందులు పడుతున్న వాళ్ళు శనివారం తెల్లవారుఝామున నాలుగు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే,ఇబ్బందులు,బాధలు సమసిపోతాయని పండితుల మాట.ఇక అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది.కాబట్టి వీలు అయినంత వరకు ఇలా చేస్తే మీ ఇబ్బందులు తొలగిపోతాయి.దీపారాధన వీలును బట్టి ఇంటిలో ఎవరైనా చేయవచ్చు.
DEVOTIONAL