మీ ఇంట్లోకి గుడ్లగూబ కాకి వస్తే ఏమవుతుందో తెలుసా..

సాధారణంగా మన ఇంటి ఆవరణలో ఇంటి పైకప్పు ప్రాంతంలో ఎన్నో రకాల పక్షి జాతులు వచ్చి వాలుతు ఉంటాయి.అయితే కొందరు ప్రజలు పక్షులు ఇంటి దగ్గరకు రాగానే వాటిని తరిమేస్తూ ఉంటారు.

 Do You Know What Will Happen If A Crow Owel  Enters Your House , Crow ,owel ,vas-TeluguStop.com

మరికొందరు మాత్రం పక్షులను ప్రేమగా గింజలు పెడుతూ ఉంటారు.అయితే కొన్ని కొన్ని సార్లు మనం అనుకోకుండా ఇల్లు వాకిలి తెరిచి ఉంచినప్పుడు కొన్ని రకాల పక్షులు ఇంట్లోకి వస్తూ ఉంటాయి.

కేవలం పక్షులు మాత్రమే కాదు జంతువులు కూడా ఇంట్లోకి ప్రవచిస్తూ ఉంటాయి.అయితే ఇలా పక్షులు, జంతువులు ఇంట్లోకి ప్రవేశించడం మంచిది కాదు అని కొంతమంది పండితులు చెబుతున్నారు.

మరి ముఖ్యంగా కొందరు అయితే కాకి, గుడ్లగూబ వంటి పక్షులు ఇంట్లోకి రావడం అశుభమని, కీడు జరుగుతుందని నమ్ముతూ ఉంటారు.కొన్ని వాస్తు శాస్త్రాల ప్రకారం పక్షులు లేదా జంతువులు ఇంట్లోకి హఠాత్తుగా వచ్చినట్లయితే అది దైవిక శక్తి పంపిన సంకేతంగా అర్థం చేసుకోవచ్చు.

అయితే ఇలా పక్షులు, జంతువులు ఇంట్లోకి రావడం వెనుక కొన్ని అర్థాలు కూడా ఉన్నాయి.మరి కాకి, గుడ్లగూబ ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Crow, Diwali, Goddess Lakshmi, Owel, Vastu, Vastu Shastram, Vastu Tips-Te

గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం అన్న విషయం తెలిసిందే.కొందరు గుడ్లగూబని చూసి భయపడితే మరి కొందరు మాత్రం అసహ్యించుకుంటూ ఉంటారు.కేవలం దీపావళి రోజున మాత్రమే గుడ్లగూబ రాకను శుభప్రదంగా మరికొంతమంది భావిస్తారు.

Telugu Crow, Diwali, Goddess Lakshmi, Owel, Vastu, Vastu Shastram, Vastu Tips-Te

ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవిని పూజించే రోజు కాబట్టి.ఇతర రోజులలో గుడ్లగూబ రాక వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉందని చాలామంది నమ్ముతారు.ఇంట్లోకి గుడ్లగూబ వస్తే ఇంట్లో నివసించే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది.

ఇంట్లోకి గుడ్లగూబ వస్తే దానికి పరిష్కారంగా ఎర్రటి గుడ్డ,తిలకం దానం చేయడం మంచిది.అంతేకాకుండా ఇంట్లోకి కాకి వస్తే ఆ ఇంట్లోకి శని ప్రవేశిస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కాకి శనివాహనం అన్న విషయం తెలిసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube