మహా శివరాత్రి రోజు మాత్రమే తెరిచే.. దేవాలయం ఎక్కడుందో తెలుసా..

ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు.మహాశివరాత్రి రోజు శివ భక్తులకు ఎంతో పవిత్రమైన రోజు.

 Madhya Pradesh Someshwara Temple Opens On Maha Shivaratri Itself Details, Madhya-TeluguStop.com

భక్తులంతా పరమశివుడిని దర్శించుకునేందుకు దేవాలయాలకు వెళ్తుంటారు.మనదేశంలో ఎన్నో ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి.

అయితే ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని ఒక ప్రసిద్ధ శివాలయం విశిష్టత వెలుగులోకి వచ్చింది.దశాబ్దాలుగా మూసివేసిన ఆలయాన్ని కేవలం మహాశివరాత్రి రోజున మాత్రమే తెరుస్తారు.సోమేశ్వరాలయంగా పిలువబడే ఈ దేవాలయం భూపాల్ కు 48 కిలో మీటర్ల దూరంలో ఉంది.1000 అడుగుల ఎత్తైన కొండ పై ఈ ఆలయం ఉంది.

Telugu Bakti, Devotional, Madhya Pradesh, Madhyapradesh, Maha Shivaratri-Latest

పదివ శతాబ్ధంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.1283వ సంవత్సరంలో జలాలుద్దీన్ ఖిల్జీ ఈ దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నాడు.ఆ తర్వాత మాలిక్ కపూర్, మహమ్మద్ షా తుగ్లక్, సాహిబ్ ఖాన్లు సోమేశ్వరాలయాన్ని ఆక్రమించుకున్నారు.1543లో షేర్షా సూరి ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నాడు.సామాన్య ప్రజల కోసం ఈ దేవాలయాన్ని తెరవాలని ఈ 1974లో ఉద్యమం జరిగింది.దీని తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సేథీ సోమేశ్వర ఆలయానికి తాళం వేసి సామాన్య ప్రజలు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చారు.

Telugu Bakti, Devotional, Madhya Pradesh, Madhyapradesh, Maha Shivaratri-Latest

అయితే కేవలం శివరాత్రి రోజు మాత్రమే ఈ దేవాలయంలో పూజలు నిర్వహించేందుకు అనుమతిని ఇచ్చారు.ప్రస్తుతం ఈ దేవాలయాన్ని పురావస్తు శాఖ నిర్వహిస్తుంది.మహా శివరాత్రి రోజు 12 గంటల పాటు అంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ దేవాలయాన్ని తెరుస్తారు.గత సంవత్సరం ఒక మతపరమైన కార్యక్రమంలో పండిత్ ప్రదీప్ మిశ్రా ఆ సోమేశ్వరా ఆలయం గురించి ప్రస్తావించినప్పుడు ఈ విషయం గురించి ప్రజలందరికీ తెలిసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube