Spotless And Glowing Skin : స్పాట్ లెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి ప్రయత్నిస్తున్నారా.. అయితే ఈ న్యాచురల్ క్రీమ్ మీకోసమే!

తమ చర్మం( Skin ) పై ఎలాంటి మచ్చ లేకుండా కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.కానీ చాలా మందికి అటువంటి చర్మాన్ని పొందడం ఎంతో కష్టతరంగా మారుతుంటుంది.

 Try This Natural Cream For Spotless And Glowing Skin-TeluguStop.com

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చర్మంపై ఏదో ఒక రకంగా మచ్చలు ఏర్పడుతూనే ఉంటాయి.వాటిని చూస్తూ కొంద‌రు దిగులు చెందుతూ ఉంటారు.

మ‌రికొంద‌రు ఎలాగైనా స్పాట్ లెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్( Spotless and Glowing Skin ) పొందాల‌ని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే అలాంటి వారి కోసం ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ చాలా బాగా సహాయపడుతుంది.

రెగ్యులర్ గా ఈ క్రీమ్ ను కనుక వాడితే చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్న మాయమవుతాయి.అదే సమయంలో చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Face Cream, Skin, Natural Cream, Skin Care, Skin Care Tips, Spotles

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ వేపాకులు( Neem Leaves ) వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) మరియు మూడు టేబుల్ స్పూన్లు వేపాకు జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Face Cream, Skin, Natural Cream, Skin Care, Skin Care Tips, Spotles

దాదాపు రెండు నుంచి మూడు నిమిషాలు కలిపితే క్రీమ్ తయారవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్‌లో స్టార్‌ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖాన్ని వాటర్ తో క్లీన్ చేసుకుని ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.

క్రీమ్ అప్లై చేశాక కనీసం రెండు నిమిషాల పాటు చర్మాన్ని మసాజ్ చేసుకుని పడుకోవాలి.ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా ప్రతిరోజు కనుక చేశారంటే చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్న క్రమంగా మాయమవుతాయి.అలాగే మొటిమలు( Pimples ) ఉంటే తగ్గు ముఖం పడతాయి.

చర్మం గ్లోయింగ్‌ గా మరియు స్మూత్ గా( Smooth and Glowing Skin ) మారుతుంది.అందంగా మెరుస్తుంది కాబట్టి స్పాట్ లెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ప్రయత్నిస్తున్న వారు తప్పకుండా ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube