సాధారణంగా ఒక సినిమా కి అనుకున్న హీరో ఖచ్చితంగా వర్కౌట్ అవుతాడనే రూల్ ఏమి లేదు.ఆ సమయానికి ఆ హీరో డేట్స్ ఖాళీగా లేకపోవచ్చు, లేదంటే సినిమా కథ నచ్చకపోవచ్చు.
ఇలా సినిమా కోసం చాలానే ఇబ్బందులు ఉంటాయి.ఒక్కోసారి అనుకున్న వారికన్నా బెటర్ యాక్టర్ దొరికే ఛాన్స్ ఉంటుంది.
కానీ కొన్నిసార్లు ఆ అవకాశం ఉండకపోవచ్చు.ఇలా సినిమా పరిశ్రమలు అనేక దోబూచులాటలు జరుగుతూనే ఉంటాయి.
కానీ అది అందరూ హార్ట్ కి అయితే తీసుకోరు.ఎందుకంటే వారు వదిలేసిన సినిమా బ్లాక్ భాస్కర్ హిట్ అయిందని బాధ పడిన సంఘటనలు ఉన్నప్పటికీ వాటిని బయట చెప్పుకోవడానికి స్టార్స్ ఎవరూ కూడా ఇష్టపడరు.
కానీ నాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) మాత్రం అందరికీ చాలా విరుద్ధం.తన మనసులో ఏది కూడా దాచుకోడు.మీడియా ముందు ఎవరు ఏం అడిగిన చెప్పేస్తాడు.అలా తను ఎంతో ఇష్టపడి నటించాలి అనుకున్న ఒక సినిమా డేట్స్ ( Movie Dates ) కుదరని కారణంగా వేరే హీరో చేశాడట.
అది ఆ తర్వాత తీరా సినిమా విడుదలై బ్లాక్ బ్లాస్టర్ హిట్టుగా మారిందట.అది చూసిన ప్రతిసారి తనకు ఎంతో బాధ కలుగుతుందని కానీ జీవితంలో ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి అందులో ఇది ఒకటి.
ఆ రోజు అది రాలేదంటే దానికి మించి ఇంకోటి ఏదో రాబోతుందని అర్థం అని తనను తాను సర్దిపుచ్చుకుంటానని నాని చెబుతున్నాడు.
ఇంతకి తాను డేట్స్ సమస్య వలన వదిలి పెట్టిన సినిమా ఏంటి అంటే రాజా రాణి( Raja Rani Movie ) ఈ సినిమాలో ఆర్య పాత్రలో నాని నటించాల్సి ఉందట.కానీ ఆ టైంలో మరో సినిమాతో బిజీగా ఉండడం వల్ల రాజా రాణి సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడట.దాంతో దర్శకుడు తమిళ హీరో ఆర్యతో( Arya ) ఆ సినిమా పూర్తి చేశాడట.
అలా తన లైఫ్ లో ఒక మంచి సినిమాని పోగొట్టుకున్నానని నాని చెప్పడం విశేషం.ఇది కేవలం నాని లైఫ్ లో మాత్రమే కాదు అందరి లైఫ్ లో జరిగే సాధారణ సంఘటన .చాలామంది హీరోలకు వెరీ కామన్ విషయం ఇది.