సాధారణంగా చాలా మంది భోజనం తక్కువగా తినాలి అని కోరుకుంటారు.కానీ, కంటి ముందు నోరూరించే వంటలు కనిపిస్తే.
ఆకలి మరింత రెట్టింపు అయిపోతుంది.దాంతో ఆకలిని తగ్గించుకోలేక, నోటిని కట్టి పెట్టలేక ఫుడ్‌ను ఓవర్‌గా లాగించేస్తారు.
ఫలితంగా, కేలరీలు పెరుగుతాయి.బరువూ పెరుగుతారు.
ఇక ఈ అధిక బరువు కారణంగా గుండె జబ్బులు, మధుమేహం, రక్త పోటు ఇలా అనేక జబ్బులు చుట్టు ముట్టేందుకు రెడీ అయిపోతాయి.అందుకే ఆకలిని, నోటిని కట్టిపెట్టి.
భోజనాన్ని అతిగా కాకుండా సరిపడా మాత్రమే తీసుకోవాలి.
అలా తీసుకోవాలి అంటే.కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.మరి ఆ టిప్స్ ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసే పది నిమిషాల ముందు ఖచ్చితంగా ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి.దీని వల్ల ఆకలి కాస్త తగ్గిపోతుంది.
దాంతో ఆహారం తక్కువ తీసుకుంటారు.అలాగే ఎప్పుడు కూడా తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
ఎందుకంటే, ఫైబర్ ఉండే ఆహారం కొంచెం తీసుకునే సరికి కడుపు నిండిన భావన కలుగుతుంది.
దాంతో ఫుడ్ తక్కువగా తీసుకుంటారు.ఎన్ని ఐటెమ్స్ ఉన్నా భోజనం తక్కువ తినాలి అని భావించే వారు.తినే ముందు వండిన వంటల వాసనను రెండు నిమిషాల పాటు గట్టిగా పిల్చాలి.
అంతే దెబ్బకు సగం ఆకలి తగ్గిపోతుంది.దాంతో మీరే తక్కువ తింటారు.
అలాగే భోజనాన్ని ఎప్పుడూ చిన్న ప్లేటులో ఆహారం వడ్డించుకుని తినాలి.ఎందుకంటే, చిన్న ప్లేట్స్‌లో భోజనం వడ్డించుకోవడం వల్ల.
అది ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది.ఫలితంగా, తక్కువ తింటారు.
ఇక తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం కొంచెం తీసుకున్నా.కడుపు నిండుతుంది.దాంతో తక్కువగా తినగలరు.
అదేవిధంగా.బీన్స్, బఠాణీలు, కాయధాన్యాలు, గుడ్లు, యాపిల్స్, నట్స్, ఓట్ మీల్ వంటివి డైట్‌లో చేర్చుకుంటే అధిక ఆకలి తగ్గుముఖం పడుతుంది.
ఫలితంగా, ఆహారం మితంగా తీసుకుంటారు.